India-New Zealand 2nd Test: అజాజ్‎కు ఏడు వికెట్లు..మయాంక్ అగర్వాల్ 150 ఔట్

ABN , First Publish Date - 2021-12-04T18:15:32+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొనసాగుతుంది. రెండో రోజు లంచ్ బ్రేక్ పూర్తైన తర్వాత క్రీజులోకి వచ్చిన టీమిండియా ఏడో వికెట్‎ను కోల్పోయింది. అజాజ్ పటేల్ వేసిన

India-New Zealand 2nd Test: అజాజ్‎కు ఏడు వికెట్లు..మయాంక్ అగర్వాల్ 150 ఔట్

ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొనసాగుతుంది. రెండో రోజు లంచ్ బ్రేక్ పూర్తైన తర్వాత క్రీజులోకి వచ్చిన టీమిండియా ఏడో వికెట్‎ను కోల్పోయింది. అజాజ్ పటేల్ వేసిన 100వ ఓవర్‎లో నాలుగో బంతికి ఫోర్ కొట్టి అగర్వాల్ 150 రన్స్‎ని పూర్తి చేసుకున్నాడు. అయితే.. మయాంక్ వెంటనే తర్వాతి బంతికే కీపర్‎కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా స్కోర్ 291 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్, మయాంక్ అగర్వాల్ కలిసి 67 పరుగులు పార్ట్‎నర్షిప్‎ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని అజాజ్ పటేల్ విడదీశాడు.


మరోవైపు అక్షర్ పటేల్ కూడా తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. (113 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‎తో 50) రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‎లో 100 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ స్కోర్ ఏడు వికెట్లను కోల్పోయి 291 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ స్కోర్ ఏడు వికెట్లను కోల్పోయి 310 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు.


అయితే.. రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లైనప్‎ను కివీస్ స్పినర్ అజాజ్ కోలుకోలేని దెబ్బతీశాడు. టీమిండియా ఆటగాళ్ల వికెట్లను ఇప్పటి వరకు కివీస్ బౌలింగ్‎లో అజాజ్ పటేల్ మాత్రమే ఏడు వికెట్లను తీయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated Date - 2021-12-04T18:15:32+05:30 IST