India-New Zealand 1st Test: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

ABN , First Publish Date - 2021-11-25T16:21:51+05:30 IST

న్యూజిలాండ్‎తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‎కు దిగిన టీమిండియా జట్టుకు ఆదిలో గట్టి దెబ్బ తగిలింది. 21 పరుగులకే తొలి వికెట్ ...

India-New Zealand 1st Test: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

కాన్పూర్: న్యూజిలాండ్‎తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‎కు దిగిన టీమిండియా జట్టుకు ఆదిలో గట్టి దెబ్బ తగిలింది. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జెమీషన్ బౌలింగ్ బ్లండెల్‎కు మయాంక్ అగర్వాల్ (13) క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో నయా వాల్ పుజారా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 రన్స్ చేసింది. క్రీజులో శుభమన్ గిల్ (33), చటేశ్వర్ పుజారా (5) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

Updated Date - 2021-11-25T16:21:51+05:30 IST