భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఇండియన్-అమెరికన్లు!

ABN , First Publish Date - 2020-08-08T22:53:44+05:30 IST

ఓసీఐ( ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారుల ప్రయోజనాలను పునరుద్ధరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్-అ

భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఇండియన్-అమెరికన్లు!

వాషింగ్టన్: ఓసీఐ( ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారుల ప్రయోజనాలను పునరుద్ధరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్-అమెరికన్లు స్వాగతించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ ప్రపంచంలో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఓసీఐ కార్డుదారుల ప్రయోజనాలపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే.. అంతర్జాతీయ ప్రయాణాలపై వివిధ దేశాలు ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో భారత ప్రభుత్వం.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో ద్వైపాక్షిక ‘ఎయిర్ బబుల్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్న ఓసీఐ కార్డుదారులను భారత్‌లోకి అనుమతించనున్నట్లు భారత హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం రోజు ప్రకటించింది. అంతేకాకుండా వారి ప్రయోజనాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఇండియన్-అమెరికన్లు భారత ప్రభుత్వ  నిర్ణయంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో కుదుర్చుకున్న తాజా ఒప్పందం ప్రకారం.. భారతీయ పౌరులు కూడా ఏ రకమైన వీసాతోనైనా సదరు దేశాలకు వెళ్లొచ్చు.

Updated Date - 2020-08-08T22:53:44+05:30 IST