భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తకు అరుదైన గౌర‌వం

ABN , First Publish Date - 2020-07-11T19:31:24+05:30 IST

ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ పరాగ్ చిట్నిస్ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్(ఎన్ఐఎఫ్ఏ) తాత్కాలిక‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్తకు అరుదైన గౌర‌వం

వాషింగ్ట‌న్ డీసీ: ప్రముఖ భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ పరాగ్ చిట్నిస్ ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్(ఎన్ఐఎఫ్ఏ) తాత్కాలిక‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎన్ఐఎఫ్ఏ అనేది యూఎస్‌లో సమాఖ్య నిధుల ద్వారా వ్యవసాయ పరిశోధనలు నిర్వ‌హించే సంస్థ‌. ఈ ఏడాది ప్రారంభంలో చిట్నిస్‌ను ఎన్ఐఎఫ్ఏ ప్రోగ్రామ్స్‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించారు. దీంతో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో సుమారు 1.7 బిలియన్ డాలర్ల పరిశోధన ప్రాజెక్టుల అమలు జ‌రిగింది. "డాక్టర్ చిట్నిస్‌కు డైరెక్టర్ కార్యాలయంలో 31 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధన, అనుభవాన్ని క‌లిగి ఉన్నారు. అందుకే ఆయ‌న‌ను ఎన్ఐఎఫ్ఏ తాత్కాలిక‌ డైరెక్టర్‌గా నియమించ‌డం జ‌రిగింద‌ని" యూఎస్ వ్యవసాయ కార్యదర్శి సోనీ పెర్డ్యూ  తెలిపారు. ఇంత‌కుముందు ఈ ప‌ద‌విలో ఉన్న డాక్టర్ స్కాట్ యాంగిల్ స్థానంలో చిట్నిస్ నియ‌మితుల‌య్యారు. గైనెస్విల్లెలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో వ్యవసాయం, సహజ వనరుల ఉపాధ్యక్షునిగా స్కాట్ నియ‌మితులు కావ‌డంతో చిట్నిస్‌కు ఈ ప‌ద‌వి ద‌క్కింది. 

Updated Date - 2020-07-11T19:31:24+05:30 IST