ఆ రోజులు వెళ్లిపోయాయని అనుకున్నా కానీ.. భారత సంతతి అమెరికన్ నేత ఆగ్రహం!

ABN , First Publish Date - 2022-04-17T00:41:26+05:30 IST

భారత్‌ ఓ చెత్త దేశమంటూ అమెరికా న్యాయవిద్య ప్రొఫెసర్ ఏమీ వ్యాక్స్ ఇటీవల కామెంట్ చేయడాన్ని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తాజాగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జుగుప్సాకరమంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ ఏమీ వ్యాక్స్...

ఆ రోజులు వెళ్లిపోయాయని అనుకున్నా  కానీ..  భారత సంతతి అమెరికన్ నేత ఆగ్రహం!

ఎన్నారై డెస్క్: భారత్‌ ఓ చెత్త దేశమంటూ అమెరికా న్యాయవిద్య ప్రొఫెసర్ ఏమీ వ్యాక్స్ ఇటీవల కామెంట్ చేయడాన్ని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తాజాగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జుగుప్సాకరమంటూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఏమీ వ్యాక్స్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ‘‘ఇండియానే ఓ చెత్త దేశమైతే.. అక్కడి వారు అమెరికా వచ్చి స్థానిక పరిస్థితులపై తెగ విమర్శలు గుప్పిస్తుంటారు’’ అని ఏమీ నోరుపారేసుకున్నారు. దీనిపై రాజా కృష్ణమూర్తి తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఒకప్పుడు అమెరికాలో ఇటువంటి వ్యాఖ్యలు వినిపించేవన్న ఆయన.. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడంతో ఆ రోజులు పోయాయని అనుకున్నట్టు తెలిపారు. ‘‘ఇలాంటి కామెంట్స్.. మైనారిటీలపై విద్వేష పూరిత దాడులకు ఆజ్యం పోస్తాయి’’ అని ట్వీట్ చేశారు. రాజా కృష్ణమూర్తి ప్రస్తుతం ఇల్లినాయ్ రాష్ట్రం 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 



Updated Date - 2022-04-17T00:41:26+05:30 IST