Abortion restrictions: మహిళలకు షాకిచ్చే చట్టం తీసుకొచ్చిన ఇండియానా..!

ABN , First Publish Date - 2022-08-01T05:19:10+05:30 IST

పిండం పెరుగుదల ఏ స్థాయిలో ఉందన్న దానితో నిమిత్తం లేకుండా అబార్షన్ నిషేధించే ఓ కొత్త బిల్లుకు ఇండియానా రాష్ట్ర పెద్దల సభ ఆమోదం పొందింది.

Abortion restrictions: మహిళలకు షాకిచ్చే చట్టం తీసుకొచ్చిన ఇండియానా..!

ఎన్నారై డెస్క్: పిండం పెరుగుదల ఏ స్థాయిలో ఉందన్న దానితో నిమిత్తం లేకుండా అబార్షన్ నిషేధించే(Abortion ban) ఓ కొత్త బిల్లు.. ఇండియానా(Indiana) రాష్ట్ర పెద్దల సభ ఆమోదం పొందింది. రిపబ్లికన్‌ల మెజారిటీ ఉన్న ఈ సభలో బిల్లు పాసైంది. కొద్ది సందర్భాల్లో మాత్రమే అబార్షన్‌కు అనుమతించేలా ఈ బిల్లును రూపొందించారు. ఫలితంగా..ఇండియానాలో ఇక అబార్షన్ అసాధ్యమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సెనెట్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న సభ్యులు.. బిల్లుపై విస్త్రత చర్చ అనంతరం 26-20 మెజారిటీతో ఆమోదముద్ర వేశారు. రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే..అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 


అబార్షాన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కు కాదంటూ ఇటీవల అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చిన నేపథ్యంలో ఇండియానా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే..బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు రిపబ్లికన్ నేతలు కూడా ఈ  బిల్లును వ్యతిరేకించారు. తాజా బిల్లులో అబార్షన్‌‌పై పూర్తిస్థాయి నిషేధం విధించలేదంటూ కొందరు వ్యతిరేకించగా మరికొందరు మాత్రం.. వైద్యపరమైన అంశాల్లో కూడా ఈ బిల్లు మహిళలకున్న హక్కులను దూరం చేసేలా ఉందంటూ వ్యతిరేక ఓటు వేశారు. మరో రాష్ట్రం వర్జీనియాలో కూడా అబార్షన్ నిషేధించే బిల్లుకు ఆమోదముద్ర వేసేందుకు చట్ట సభ సభ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2022-08-01T05:19:10+05:30 IST