Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 09:47:00 IST

Indian-2: ఇంకా ముందే సెట్స్‌పైకి ..?

twitter-iconwatsapp-iconfb-icon

కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), క్రియేటివ్ జీనియస్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 (Indiyan 2) మళ్ళీ సెట్స్‌పైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఇండియన్ 2 కొత్త షెడ్యూల్ మొదలబోతుందని, దీనిలో తాను కూడా జాయిన్ కాబోతున్న విషయాన్ని తెలిపింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇంకా ముందే ఓ చిన్న షెడ్యూల్ ప్రారంభం కాబోతుందట. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ ఓ భారీ చిత్రాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అటు చరణ్‌కి 15వ సినిమా, దిల్ రాజు సంస్థలో నిర్మితమవుతున్న ప్రతిష్ఠాత్మక 50వ సినిమా. అందుకే, బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

దిల్ రాజు ప్లాన్ ప్రకారం 2023, సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఆమధ్య ప్రకటించారు. కానీ, ఆర్సీ 15 షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా 2023, సమ్మర్‌కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే అది కూడా సాధ్యమవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఆగస్టు చివరిలో శంకర్ ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభించనున్నారట. ఈ చిన్న షెడ్యూల్ తర్వాత సెప్టెంబర్ 13 నుంచి భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆర్సీ 15 ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో కాస్త డైలమాగా ఉంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement