Abn logo
Apr 5 2020 @ 18:43PM

‘ఇండియన్ 2’ను ఆపేస్తున్నారా?

Kaakateeya

‘ఇండియన్ 2’ సినిమాను ఆపేస్తారా అంటే అవుననే మాటలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం దశలోనే హీరో కమల్ హాసన్‌కు గాయాలు కావడంతో కొన్ని రోజులు ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఆ తర్వాత షూటింగ్ జరుగుతున్న సమయంలోనే క్రేన్ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగింది. చిత్రయూనిట్‌పై కేసు కూడా నమోదు అయింది. వీటి నుంచి బయట పడి మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దామనుకునే సమయానికి కరోనా వైరస్ ఈ మూవీకి శాపంగా మారింది. దేశావ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి.


దీంతో ఈ చిత్రాన్ని ఆపేయాలనే భావనకు చిత్ర నిర్మాతలు వచ్చినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తుండటంతో నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఖర్చు పెట్టిన డబ్బులను కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈ విషయాన్ని లాక్ డౌన్ తర్వాత ప్రకటిస్తారే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


కాగా ఇండియన్2 సినిమా భారతీయుడు మూవీకి సీక్వెల్. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. కమల్ సరసన కాజల్ కనిపించనున్నారు. లైకా బ్యానర్లో సుభాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  


Advertisement
Advertisement
Advertisement