Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 04 Aug 2022 10:53:09 IST

Indian-2: అసలు సాధ్యమేనా..?

twitter-iconwatsapp-iconfb-icon

ఇండియన్ 2 ఈ ఏడాది సెట్స్‌పైకి రావడం సాధ్యమేనా అంటే దాదాపుగా కష్టమనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ - కియారా అద్వానీ (Kiara Advani) జంటగా ఆర్సీ 15ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇండియన్ 2 మళ్ళీ సెట్స్‌పైకి రాబోతుందని..వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ మూవీలో కాజల్ అగర్వాల్ నటించడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) దాదాపు 15 ఏళ్ళపాటు స్టార్ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగింది. 

తెలుగులో ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) లాంటి యంగ్ హీరోల దగ్గర్నుంచీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరకు అలాగే, తమిళంలో సూర్య, అజిత్ లాంటి స్టార్ హీరోలతోనూ నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే, ప్రస్తుతానికి కాజల్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తల్లిగా ప్రస్తుతం వ్యక్తిగత జీవితంను బాగా ఎంజాయ్ చేస్తోంది. కాజల్ పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి కొత్త ప్రాజెక్ట్స్ కమిటైంది. వాటిలో కొన్నింటిని పూర్తి చేయగలిగింది. నాగార్జునతో చేయాల్సిన 'ది ఘోస్ట్', శంకర్ - కమల్ హాసన్ కాంబోలో మొదలైన ఇండియన్ 2 (Indian 2) సినిమాలను మాత్రం పూర్తి చేయలేకపోయింది. 

Indian-2: అసలు సాధ్యమేనా..?

ఘోస్ట్ మూవీ నుంచి తప్పుకోగా తన స్థానంలో సోనాల్ చౌహాన్ వచ్చి చేరింది. అయితే, తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఇండియన్ 2 నుంచి కాజల్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో 1996లో వచ్చి ఘన విజయం సాధించిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 మొదలై దాదాపు సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. కానీ, దర్శకనిర్మాతల మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మూవీ గత కొన్ని నెలలుగా ఆగిపోయింది. ఇటీవలే ఇరువురి మధ్య రాజీ కుదిరి మళ్ళీ సినిమాను సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కమల్ సరసన కాజల్ కాకుండా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ దీపిక పదుకొణ్ లేదా కత్రినా కైఫ్‌లలో ఒకరిని ఫైనల్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అసలు ఆర్సీ 15 చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇది కాకుండానే ఇండియన్ 2 సెట్స్ మీదకి అంటే కష్టమని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు హీరోయిన్స్‌కి సబంధించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి వీటన్నిటికీ మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడిస్తారో. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement