జెమీమాకు ఝలక్‌

ABN , First Publish Date - 2022-01-07T09:10:24+05:30 IST

ప్రతిష్టాత్మక మహిళల వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు.

జెమీమాకు ఝలక్‌

వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత మహిళల జట్టు 

పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల వన్డే వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. మిథాలీ రాజ్‌ నేతృత్వంలోని 15 మందితో కూడిన ఈ జాబితాలో స్టార్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌కు ఉద్వాసన పలకడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఆల్‌రౌండర్‌ శిఖా పాండేను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు న్యూజిలాండ్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. చివరి వరల్డ్‌కప్‌ (2017)లో భారత జట్టు రన్నర్‌పగా నిలిచింది. అలాగే ప్రపంచక్‌పనకు ముందు ఫిబ్రవరి 9న కివీ్‌సతో ఏకైక టీ20 కోసం హర్మన్‌ నేతృత్వంలో జట్టును కూడా ప్రకటించారు.


అంతేకాకుండా ఫిబ్రవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీ్‌సలోనూ వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన జట్టే బరిలోకి దిగనుంది. మిథాలీకిదే చివరి వరల్డ్‌కప్‌ కానుండగా, ఈ టోర్నీ తర్వాత ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఇక జట్టులో స్టార్‌ ప్లేయర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జులన్‌ గోస్వామి ఉండగా, ఇద్దరు వికెట్‌ కీపర్లుగా రిచా ఘోష్‌, తానియా భాటియా వ్యవహరించనున్నారు. ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్‌, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌ రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం భారత జట్టు మార్చి 6న పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టైటిల్‌ వేటను ఆరంభించనుంది. 


ఫామ్‌లో లేకనే..:

ఇటీవల టీ20 లీగ్‌ల్లో మెరుగ్గానే రాణించిన జెమీమా అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం నిలకడ చూపలేకపోతోంది. ఈ కారణంగానే ఆమెపై వేటు పడిందని సమాచారం. అయితే వెటరన్‌ శిఖా పాండే ఉంటే ఆమె అనుభవం జట్టుకు ఉపయోగపడేదని మాజీ కెప్టెన్‌ డయా నా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. మరో టాపార్డర్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌ను కూడా ఈ టోర్నీకి పక్కనబెట్టారు. 


వన్డే వరల్డ్‌కప్‌, కివీ్‌సతో వన్డే సిరీ్‌సకు జట్టు

 మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌, స్మృతీ మంధాన, షఫాలీ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ్‌ రాణా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్‌, తానియా భాటియా, రాజేశ్వరి, పూనమ్‌ యాదవ్‌. స్టాండ్‌బై ఆటగాళ్లు: ఎస్‌. మేఘన, ఏక్తా బిస్త్‌, సిమ్రన్‌ దిల్‌.


ఏకైక టీ20 కోసం..:

హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), మంధాన, షఫాలీ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ్‌ రాణా, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్‌, తానియా భాటియా, రాజేశ్వరి, పూనమ్‌ యాదవ్‌, ఎస్‌. మేఘన, ఏక్తా బిస్త్‌, సిమ్రన్‌ దిల్‌.

Updated Date - 2022-01-07T09:10:24+05:30 IST