వినేశ్‌ పసిడి పట్టు

ABN , First Publish Date - 2021-03-01T09:41:33+05:30 IST

కరోనా కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత పోటీపడ్డ తొలి ఈవెంట్‌లో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అద్భుత ప్రదర్శన చేసింది.

వినేశ్‌ పసిడి పట్టు

కీవ్‌ (ఉక్రెయిన్‌): కరోనా కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత పోటీపడ్డ తొలి ఈవెంట్‌లో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అద్భుత ప్రదర్శన చేసింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన అంతర్జాతీయ మెమోరియల్‌ టోర్నమెంట్‌లో పసిడి పట్టుతో చాంపియన్‌గా నిలిచింది. 53 కిలోల విభాగం బరిలోకి దిగిన వినేశ్‌ తుదిపోరులో 2017 ప్రపంచ చాంపియన్‌ కలాజిన్‌స్కేను చిత్తుగా ఓడించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో వినేశ్‌ 4-0 స్కోరు తేడాతో కలాజిన్‌స్కేపై విజయం సాధించింది.


ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వినేశ్‌.. టోక్యో క్రీడలకు ముందు ఈ విజయం ఉత్సాహాన్నిచ్చేదే. వినేశ్‌ తన తదుపరి టోర్నీలో భాగంగా ఈనెల 4 నుంచి 7 వరకు ఇటలీలోని మ్యాటో పెలిసోన్‌లో జరిగే యూడబ్ల్యూడబ్ల్యూ సిరీ్‌సలో తలపడనుంది. ఇదే ఈవెంట్‌లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు బజ్‌రంగ్‌ పూనియా, రవి దహియా కూడా పోటీపడనున్నారు.  

Updated Date - 2021-03-01T09:41:33+05:30 IST