ప్రపంచంలోనే భారతదేశంలో Women Pilots అధికం...పౌర విమానయాన శాఖ వెల్లడి

ABN , First Publish Date - 2021-12-08T17:54:18+05:30 IST

ప్రపంచంలోనే భారతదేశంలో మహిళా పైలట్లు అధికమని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది....

ప్రపంచంలోనే భారతదేశంలో Women Pilots అధికం...పౌర విమానయాన శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే భారతదేశంలో మహిళా పైలట్లు అధికమని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయంగా మహిళా పైలట్లు 5 శాతం మంది మాత్రమేనని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. కాని భారతదేశంలో 15 శాతానికి పైగా మహిళా పైలట్లు ఉన్నారని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రపంచ సగటు కంటే భారతదేశంలో 10శాతం ఎక్కువ మహిళా పైలట్లు ఉన్నారని, దేశంలో పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.‘‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5శాతం మంది పైలట్‌లు మహిళలున్నారు. 


భారతదేశంలో మహిళా పైలట్లు ఎక్కువగా ఉన్నారు’’అని మంత్రి చెప్పారు. ఇ-గవర్నెన్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో నమోదిత 17,726 మంది పైలట్‌లలో మహిళా పైలట్ల సంఖ్య 2,764మంది’’ అని మంత్రి వివరించారు.ఏవియేషన్ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్‌లోని మహిళలు, పరిశ్రమలు, ప్రముఖ మహిళా విమానయాన నిపుణులు వంటి పౌర విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి చొరవ తీసుకుంటున్నామని వీకే సింగ్ చెప్పారు. 


Updated Date - 2021-12-08T17:54:18+05:30 IST