tokyo olympics: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

ABN , First Publish Date - 2021-08-02T16:22:25+05:30 IST

భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. మూడుసార్లు ఒలింపిక్‌ విజేత అయిన ఆస్ట్రేలియాను

tokyo olympics: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు

టోక్యో: భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ఒలంపిక్స్ లో పట్టిష్టమైన కంగారూలను భారత మహిళ టీమ్ చిత్తు చేసింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. మూడుసార్లు ఒలింపిక్స్ లో విజేత అయిన ఆస్ట్రేలియాను 1-0 తేడాతో మట్టికరిపించింది. 1980 ఒలింపిక్స్‌ తర్వాత భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి చరిత్రను సృష్టించింది. ఇక క్వార్టర్స్‎లో పట్టిష్టమైన ఆసీస్‎ను అన్ని విధాలుగా రాణి సేన కట్టడి చేసింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఆసీస్‌ జట్టుకు ఏమాత్రం భారత్ అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు స్ట్రైకర్లు, మరోవైపు డిఫెన్స్ టీం అద్భుతంగా రాణించడంతో భారత్ గెలుపును సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో భారత మహిళ టీమ్ సగర్వంగా సెమీస్‎లోకి దూసుకుపోయింది. 1980 మాస్కో ఒలిపింక్స్ తర్వాత భారత్ హాకీ జట్టు అత్యుత్తమైన ప్రదర్శన చేసి...తొలిసారిగా ఒలంపిక్స్‎లో సెమీస్ చేరుకుంది. భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన అందరిని కట్టిపడేసింది.


భారత్ కు గోల్ అందించిన గుర్జిత్ కౌర్

హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్ జట్టుకు ఏకైక గోల్ అందించి గుర్జిత్ కౌర్ విజయం అందించి ఆకర్షించింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‎లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించింది. ఇక ఈ క్వార్టర్స్ కు ముందు పూల్ ‘ఎ’లో భారత్ లీగ్ దశలో రెండు మ్యాచ్‎ల్లో విజయం సాధించగా..మూడింటిలో ఓటమి చివచూసింది. 

Updated Date - 2021-08-02T16:22:25+05:30 IST