Kuwaitలో భారతీయురాలికి జాక్‌పాట్.. షాపింగ్ చేసి రూ.24లక్షలు గెలుచుకుంది!

ABN , First Publish Date - 2021-11-12T14:31:44+05:30 IST

కువైత్‌లో భారతీయురాలికి జాక్‌పాట్ తగిలింది.

Kuwaitలో భారతీయురాలికి జాక్‌పాట్.. షాపింగ్ చేసి రూ.24లక్షలు గెలుచుకుంది!

కువైత్ సిటీ: కువైత్‌లో భారతీయురాలికి జాక్‌పాట్ తగిలింది. ఆన్‌కాస్ట్ సూపర్‌మార్కెట్ మంత్లీ డ్రాలో నిలోఫర్ షేక్ అనే భారతీయ మహిళ ఏకంగా 10వేల కువైటీ దినార్లు(రూ.24.60లక్షలు) గెలుచుకున్నారు. అవెన్యూస్‌లో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే నిలోఫర్‌కు ఆన్‌కాస్ట్ సూపర్‌మార్కెట్‌లో మెంబర్‌షిప్ కార్డు ఉంది. దీంతో ఆమె తరచూ ఈ సూపర్‌మార్కెట్‌లోనే షాపింగ్ చేస్తుంటారు. ఇలా మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు ఆన్‌కాస్ట్ ప్రత్యేకంగా  రాయితీలు ఇవ్వడంతో పాటు ప్రతి నెల డ్రా నిర్వహించి విజేతకు 10వేల కువైటీ దినార్లు బహుమానంగా ఇస్తోంది.


దీంతో ఈసారి నిలోఫర్‌కు అదృష్టం వరించింది. నవంబర్ నెలవారీ లక్కీ డ్రాలో ఆమె విజేతగా నిలిచారు. దాంతో రూ.26.40లక్షలు గెలుచుకున్నారు. తాజాగా ఈ బహుమతికి సంబంధించిన చెక్‌ను సూపర్‌మార్కెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలేహ్ అల్ తునైబ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ ఆనందదాస్, మార్కెటింగ్ మేనేజర్ రెహమ్ నాసర్, ఇంపోర్ట్ అండ్ ప్రైవేట్ లేబుల్ మేనేజర్ అలీ ఇస్మాయిల్, ఏరియా మేనేజర్ ఉమేష్ పూజారి చేతులమీదుగా నిలోఫర్ అందుకున్నారు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా ఆన్‌కాస్ట్ సూపర్‌మార్కెట్‌ యాజమాన్యానికి నిలోఫర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.     


Updated Date - 2021-11-12T14:31:44+05:30 IST