భారతీయ మహిళ ప్రపంచ దేశాలకు మార్గదర్శి

ABN , First Publish Date - 2021-06-21T06:48:26+05:30 IST

వేదాల కాలం నుంచి ఇప్పటివరకు భారతీయ ఔన్నత్వాన్ని కాపాడుతూ ప్రపంచా నికి ఆదర్శంగా నిలిచిన ఘనత భారత దేశ మహిళలకే దక్కిందని ప్రముఖ సాహితీవేత్త, జాతీయ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మసన చెన్నప్ప అన్నారు. అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్‌ అఽధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి రాసిన ‘భారతీయ మహిళ’ గ్రంథాన్ని జాతీ య సాహిత్య పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆలేరులో జూమ్‌ వేదికగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

భారతీయ మహిళ ప్రపంచ దేశాలకు మార్గదర్శి
గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్‌ చెన్నప్ప

ఆలేరు, జూన్‌ 20: వేదాల కాలం నుంచి ఇప్పటివరకు భారతీయ ఔన్నత్వాన్ని కాపాడుతూ ప్రపంచా నికి ఆదర్శంగా నిలిచిన ఘనత భారత దేశ మహిళలకే దక్కిందని ప్రముఖ సాహితీవేత్త, జాతీయ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మసన చెన్నప్ప అన్నారు. అఖిల భారత జాతీయ సాహిత్య పరిషత్‌ అఽధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి  రాసిన  ‘భారతీయ మహిళ’ గ్రంథాన్ని జాతీ య సాహిత్య పరిషత్‌  జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆలేరులో జూమ్‌ వేదికగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వేదం, భాగవతం, రామాయణం, మహాభారతం మొదలు  నేటి వరకు ఆయా కాలాల్లో భారతీయ మహిళలు తమతమ రంగాల్లో రాణించి  ప్రత్యేకతను చాటు తూ ఒక స్ఫూర్తిని కలిగిస్తున్నారన్నారు. గ్రంథకర్త ఆచార్య కసిరెడ్డి వెంక ట్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా శక్తిని పర్యాయపదంగా నిలిపి భూమాత గా, గోమాతగా గీత మాతగా సమాజ గౌరవాన్ని అందుకుందన్నారు. ఈ గ్రంథం ముద్రణకు ఆర్థికంగా సహకారం అందించిన  సోమ సీతారాము లును ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ సాహి త్య పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు పెసరు లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్‌ పోరెడ్డి రంగయ్య, బండా రు జయశ్రీ, డాక్టర్‌ బేరి సునీతరామ్మోహన్‌రెడ్డి, డాక్టర్‌ లింగంపల్లి రామ చంద్ర, రమాదేవి కులకర్ణి, డాక్టర్‌ దాసోజు పద్మావతి, బండిరాజుల శంకర్‌,  ప్రసూనాదేవి పాల్గొని మాట్లాడారు. జాతీయ సాహిత్య పరిషత్‌ సభ్యురాలు పుష్పలత ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు. 


Updated Date - 2021-06-21T06:48:26+05:30 IST