పెట్రోల్ లేదన్నందుకు మూకుమ్మడి దాడి.. londonలో భారతీయ మహిళలను కిందపడేసి దారుణంగా..

ABN , First Publish Date - 2021-10-01T07:30:41+05:30 IST

పెట్రోల్ లేదని చెప్పినందుకు ఓ భారతీయ మహిళను దారుణంగా కొట్టి హింసించారు కొందరు దుండగులు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో నిందితుడిని స్థానికుడిగా గుర్తించారు. దాడి జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు గమనించి నిందితులను అడ్డుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.

పెట్రోల్ లేదన్నందుకు మూకుమ్మడి దాడి.. londonలో భారతీయ మహిళలను కిందపడేసి దారుణంగా..

లండన్: పెట్రోల్ లేదని చెప్పినందుకు ఓ భారతీయ మహిళను దారుణంగా కొట్టి హింసించారు కొందరు దుండగులు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో నిందితుడిని స్థానికుడిగా గుర్తించారు. దాడి జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు గమనించి నిందితులను అడ్డుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు.


వివరాల్లోకి వెళితే.. నెరాలీ పటేల్(38), ఉత్తర లండన్‌లోని హవర్ స్టాక్ హిల్‌లో బీపీ పెట్రోల్ పంప్ నడుపుతున్నారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఉండడంతో ఆమె షాపులో కూడా పెట్రోల్ నిండుకుంది. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు బైక్‌లపై అక్కడకు చేరుకుని పెట్రోల్ కావాలని కోరారు. అయితే నెరాలీ పెట్రోల్ లేదని చెప్పడంతో వారంతా ఆమెపై దాడికి దిగారు. ఓ వ్యక్తి ఆమెను ‘పాకీ(పాకిస్తానీలను బ్రిటిషర్స్ తిట్టే తిట్టు)’ అని తిడుతూ తోసేశాడు.


ఒక్కసారిగా కిందపడడంతో ఆమె తల నేలకు కొట్టుకుని తీవ్ర గాయమైంది. అలాగే ఆమె చేతికి కూడా గాయమైంది. అయినా నిందితులు ఆగకుండా ఆమెను దూషిస్తూ కొట్టారు. ఇంతలో అటుగా వెళుతున్న వారు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నెరాలీని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెరాలీ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్నారు. అయితే నిందితుడిని వెంటనే అరెస్టు చేశామని, కేసు కూడా నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. ఆ తర్వాత విడిచిపెట్టేశారు. విచారణ మాత్రం కొనసాగుతోందని చెబుతున్నారు.

Updated Date - 2021-10-01T07:30:41+05:30 IST