Indian Wedding: అమ్మాయి పెళ్ళికి 25 ఏళ్లు దాటితే..

ABN , First Publish Date - 2022-08-06T20:35:27+05:30 IST

కాలం మారింది. ఆడపిల్లకు 25 సంవత్సరాలు వచ్చినా ఆమె తన కాళ్ళపై తను నిలదొక్కుకునే వరకూ తల్లితండ్రులు పెళ్ళి చేయమంటున్నారు. ఆడపిల్లలు కూడా పెళ్ళికి తగిన ఆర్థికపరమైన భరోసా దొరికేవరకూ ఆగుతున్నారు.

Indian Wedding: అమ్మాయి పెళ్ళికి 25 ఏళ్లు దాటితే..

వివాహ వయస్సు: అమ్మాయి పెళ్ళి వయసు ఎంత? ఒకప్పుడు ఆడపిల్ల వయసుకు రాగానే ఆమెకు పెళ్ళి చేయాలనే ఆలోచనలో పెళ్ళి చేసి మరో ఇంటికి ఎంత త్వరగా పంపేయాలా అనే చూసేవారు తల్లితండ్రులు. అప్పటి నుంచి ఆమెపై ఎక్కడలేని ఆంక్షలు విధించేవారు. నేడు కాలం మారింది. ఆడపిల్లకు 25 సంవత్సరాలు వచ్చినా ఆమె తన కాళ్ళపై తను నిలదొక్కుకునే వరకూ తల్లితండ్రులు పెళ్ళి చేయమంటున్నారు. ఆడపిల్లలు కూడా పెళ్ళికి తగిన ఆర్థికపరమైన భరోసా దొరికేవరకూ ఆగుతున్నారు. 


వివాహానికి సరైన వయస్సు ఎంత? మగవారికంటే ఆడపిల్ల విషయంలో పెళ్ళికి ఎన్నో ఆంక్షలు వచ్చిచేరతాయి. చాలా వాదనలు, పోరాటాల తరువాత ఇప్పటికీ వారి పెళ్ళి వయసు కనీసం 24 లేదా 25 మాత్రమే.. ఇంతకన్నా ఎక్కువ సమయం దాటి ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆమె గురించి భిన్నమైన అభిప్రాయాలు బంధువుల్లో స్నేహితుల్లో ఉంటాయి. వారిపై పెళ్ళి చేసుకోవాలనే ఒత్తిడి పెరుగుతుంది.


అమ్మాయిలపై ఒత్తిడి ఎందుకు?

అమ్మాయిలు 25 ఏళ్ల తర్వాత పెళ్లికి సంబంధించిన ప్రశ్నలను తరచుగా ఎదుర్కొంటారు. ప్రతి బంధువు, పొరుగువారు కొన్నిసార్లు ప్రత్యక్షంగా లేదా కొన్నిసార్లు వాదనలు, వెక్కిరించడం, పెళ్లి వయస్సు వచ్చిందని, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనే ఉపన్యాసాలు దంచుతుంటారు. ఈ పరిస్థితిలో అమ్మాయి మానసికంగా బాధను అనుభవిస్తుంది. 


పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?

పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎక్కడైనా ఎదురైతే ఏ అమ్మాయికైనా చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కెరీర్‌పై దృష్టి సారిస్తున్నప్పుడు. అదే అబ్బాయి విషయంలో ఈ సమస్య రాదు. పెళ్ళికి సమయం ఇంకా ఉంది ముందు కెరియర్ లో స్థిరపడు అంటారు. కానీ మన సమాజంలో మాత్రం ఆడపిల్లకి కావాల్సిన ఆసరా లభించదు. అదే పెళ్లి ఒత్తిడి మాత్రం ఆమెపై పడుతోంది. 


పండుగలు, ఫంక్ష‌న్‌లు స‌రిగ్గా ఉండ‌వు.

పెళ్లి గురించి అమ్మాయిలను పదే పదే ప్రశ్నించినప్పుడు, ఇబ్బంది పడతారు. పండుగలు, పదిమంది కలిసే ఫంక్షన్ లకు వెళ్ళేందుకు ఇష్టపడరు. కొన్ని ఆనందాలకు దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. 


ధైర్యంగా ఎదుర్కుంటుంది.

అమ్మాయిలు తమ కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నప్పుడు, వైవాహిక జీవితంలో సరిగా సర్ధుకోలేక విడాకులు తీసుకున్నా కూడా సమాజం నుంచి విడాకులు తీసుకుంటుంది. అమ్మాయిల వివాహానికి తగిన వయసు ఇదని ఇప్పుడు గగ్గోలు పెట్టేవారు ఆమె జీవితంలో నిలదొక్కుకుంటే మంచి భాగస్వామి వస్తాడనే ఆలోచనలో ఉంటున్నారు. ఆర్థికంగా ఆమె స్థిరపడితే సంసార జీవితం సాఫీగా సాగుతుందని, ఆర్థికంగా భరోసాగా ఉంటుందనే ఆలోచనలో అబ్బాయిలు కూడా ఉంటున్నారు. ఇది మంచి పరిణామమే. 


అమ్మాయి ఉన్నతమైన వృత్తిని ఎంచుకుంటే, మన సమాజం, బంధువులు ఆ అమ్మాయి పట్ల తమ వైఖరిని మార్చుకుంటారు. తన కాళ్ళ మీద నిలబడిన అమ్మాయి కోరుకున్న కెరియర్ ను ఎంచుకున్నాకా స్థిరమైన అభిప్రాయాలతో తన సంసార జీవితంలో మగవాడితో సమంగా స్వతంత్రంగా జీవిస్తుంది. ఇది కెరీర్ చేసుకునే వయస్సు కాబట్టి, పెళ్లి ఒత్తిడి మధ్య అమ్మాయి కెరీర్, పెళ్లి రెండింటిని ఎంచుకోవాలి. ఇదంతా స్త్రీకి అనుభవాలను, కష్టం వస్తే కాచుకునే తెలివితేటలను అనుభవాలను అందిస్తుంది. అదే చిన్నవయసు పెళ్ళిళ్ళలో పరిపక్వత లోపిస్తుంది. కష్టం వస్తే దాటగలిగే ధైర్యం లేకపోతుంది. స్త్రీ పెళ్ళి విషయంలో తన స్వేచ్ఛను ఖచ్చితంగా చెప్పగలగాలి. 

Updated Date - 2022-08-06T20:35:27+05:30 IST