మన టీకాకు 96 దేశాల్లో గుర్తింపు.. ఆయా దేశాల్లో మనోళ్లకు నో కండీషన్స్ !

ABN , First Publish Date - 2021-11-10T17:53:18+05:30 IST

భారత్ రూపొందించిన కరోనా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

మన టీకాకు 96 దేశాల్లో గుర్తింపు.. ఆయా దేశాల్లో మనోళ్లకు నో కండీషన్స్ !

న్యూఢిల్లీ: భారత్ రూపొందించిన కరోనా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌కు ఇటీవల అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో భారత టీకాలకు గుర్తింపు లభించిన దేశాల సంఖ్య 96కి చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) మొత్తం ఎనిమిది టీకాలకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే.. అందులో రెండు(కోవిషీల్డ్, కోవాగ్జిన్) టీకాలు భారత్​ రూపొందించినవి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.


ప్రస్తుతం 96 దేశాలు ఈ రెండు టీకాలను గుర్తించాయని అన్నారు. మనోళ్ల టీకా ధృవ పత్రాన్ని పరస్పరం ఆమోదించుకునేందుకు ఈ దేశాలు అంగీకరించాయని చెప్పారు. మరిన్ని దేశాల్లో టీకా ధృవీకరణ పత్రానికి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. భారత టీకాలకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 109 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. కోవిన్ యాప్​లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. 


కోవిన్ యాప్​లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత టీకా ధృవీకరణ పత్రాన్ని ఆమోదించిన 96 దేశాల జాబితా ఇదే..

Canada, America, Bangladesh, Mali, Ghana, Sierra Leone, Angola, Nigeria, Benin, Chad, Hungary, Serbia, Poland, the Slovak Republic, Slovenia, Croatia, Bulgaria, Turkey, Greece, Finland, Estonia, Romania, Moldova, Albania, Czech Republic, Switzerland, Liechtenstein, Sweden, Austria, Montenegro, Iceland, Eswatini, Rwanda, Zimbabwe, Uganda, Malawi, Botswana, Namibia, Kyrgyz Republic, Belarus, Armenia, Ukraine, Azerbaijan, Kazakhstan, Russia, Georgia, The United Kingdom, France, Germany, Belgium, Ireland, Netherlands, Spain, Andorra, Kuwait, Oman, UAE, Bahrain, Qatar, Maldives, Comoros, Sri Lanka, Mauritius, Peru, Jamaica, The Bahamas, Brazil, Guyana, Antigua & Barbuda, Mexico, Panama, Costa Rica, Nicaragua, Argentina, Uruguay, Paraguay, Columbia, Trinidad & Tobago, Commonwealth of Dominica, Guatemala, El Salvador, Honduras, Dominican Republic, Haiti, Nepal, Iran, Lebanon, State of Palestine, Syria, South Sudan, Tunisia, Sudan, Egypt, Australia, Mongolia, Philippines. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ ధృవ పత్రంతో మనోళ్లు ఈ 96 దేశాలకు ఎలాంటి అభ్యంతరం లేకుండా వెళ్లొచ్చు. ఆయా దేశాల్లో మనోళ్లకు ఎలాంటి ప్రయాణ ఆంక్షలు ఉండవు. 

Updated Date - 2021-11-10T17:53:18+05:30 IST