ఇండియాలో కొడుకు.. అమెరికాలో తండ్రి.. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలోనే..

ABN , First Publish Date - 2021-08-05T00:34:42+05:30 IST

భారత్‌కు చెందిన 37 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ యాక్సిడెంట్‌లో మరణించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెలితే.. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన నిర్మల్ సింగ్ (37) ఇండియానాలో ఉంటూ బతుకుదెరువు కోసం అమెరికాలో గత కొన్నేళ్లుగా ట్రక్కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బు

ఇండియాలో కొడుకు.. అమెరికాలో తండ్రి.. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలోనే..

వాషింగ్టన్: భారత్‌కు చెందిన 37 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ యాక్సిడెంట్‌లో మరణించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెలితే.. హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన నిర్మల్ సింగ్ (37) ఇండియానాలో ఉంటూ బతుకుదెరువు కోసం అమెరికాలో గత కొన్నేళ్లుగా ట్రక్కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జార్జియా నుంచి కాలిఫోర్నియాకు ప్రయాణిస్తుండగా అరిజోనా రాష్ట్రంలోని హైవే నెంబర్ 40, ఫ్లాగ్‌స్టాఫ్ వద్ద సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ట్రక్కు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.



నిర్మల్ సింగ్‌తోపాటు ట్రక్కులో ప్రయాణిస్తున్న రాహుల్ అనే వ్యక్తి.. ప్రాణాపాయ స్థితిలో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ సింగ్‌కు భార్య, 11ఏళ్ల కూతురు ఉన్నారని, వాళ్లు కర్నాల్‌లో నివసిస్తున్నారని అతని స్నేహితుడు చెప్పారు. నిర్మల్ సింగ్ 14ఏళ్ల కొడుకు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు వెల్లడించారు. అయితే కొవిడ్ నేపథ్యంలో అమలులోకి వచ్చిన ఆంక్షల కారణంగా నిర్మల్ సింగ్ తన కొడుకును చివరిసారిగా చూసుకోలేకపోయాడని అతని స్నేహితుడు చెప్పారు. 


Updated Date - 2021-08-05T00:34:42+05:30 IST