Abn logo
Aug 4 2021 @ 04:56AM

భారత శిశువుకు ఉచితంగా 16 కోట్ల ఇంజెక్షన్!

ముంబై: అత్యంత అరుదైన స్పైనల్ మాస్కులర్ అట్రాఫీ (ఎస్‌ఎమ్ఏ) అనే వ్యాధితో బాధపడుతున్న భారత శిశువుకు అదృష్టం కలిసొచ్చింది. ఈ వ్యాధికి ఒకటే మందు. అదే జోల్గెన్స్‌మా ఇంజెక్షన్. కానీ దీన్ని సామాన్యులు కొనడం అసాధ్యం. ఎందుకంటే ఈ ఒక్క ఇంజెక్షన్ విలువ రూ.16కోట్లు. దీంతో చాలా మంది తమ బిడ్డకు ఈ వ్యాధి ఉందని తెలిశాక తమ బిడ్డ బతకడం కష్టమని భావిస్తారు. కొందరు క్రౌడ్ ఫండింగ్ ద్వారా అవసరమైన సొమ్మును సేకరించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన శివరాజ్ దావారే అనే పసివాడికి మాత్రం అదృష్ట దేవత ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించింది. అమెరికాలోని ఒక కంపెనీ ఈ జొల్గెన్స్‌మా ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇవ్వడం కోసం తీసిన లక్కీ డ్రాలో శివరాజ్ పేరు వచ్చింది. దీంతో ఆ కంపెనీ వాళ్లు శివరాజ్‌కు ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించబోతున్నారు. ఇలా లక్కీ డ్రాతో ఈ ఇంజెక్షన్ పొందిన తొలి భారతీయ శిశువు శివరాజే అని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. తన రెండో పుట్టిన రోజుకు ముందుగా ఈ ఇంజెక్షన్ తీసుకున్న శివరాజ్ ఇప్పుడు నవ్వుతూ తుళ్లుతూ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతున్నాడు.

తాజా వార్తలుమరిన్ని...