Advertisement
Advertisement
Abn logo
Advertisement

IND vs SL: వన్డే, టీ20 సిరీస్‌లు రెండూ భారత్‌వే: వసీం జాఫర్

న్యూఢిల్లీ: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు వన్డే, టీ20 సిరీస్ రెండింటినీ గెలుచుకునే సత్తా ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టులోని కీలక ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనలో ఉండడంతో యువకులతో కూడిన కొత్త జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో జాఫర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 


భారత జట్టులో కీలక ఆటగాళ్లు లేనప్పటికీ శ్రీలంక పర్యటనలో టీమిండియానే రెండు ట్రోఫీల్లోనూ ఫేవరెట్ అని జాఫర్ పేర్కొన్నాడు. జట్టులో అలాంటి సామర్థ్యం గల ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. జట్టు చాలా బలంగా ఉందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నాడు. శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, భువీ, యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లు వన్డే రెగ్యులర్లు అని గుర్తు చేశాడు. 


అతి త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో పృథ్వీషా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, వంటి యువ ఆటగాళ్లకు ఇది అందివచ్చిన అవకాశమని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా రాహల్ ద్రవిడ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుండడంతో అతడి నుంచి వీరు చాలా నేర్చుకునే అవకాశం దక్కిందన్నాడు.

Advertisement
Advertisement