ఐపీఎల్‌ 2022లో ఇండియన్ సూపర్‌స్టార్లు డీలా

ABN , First Publish Date - 2022-04-15T00:26:21+05:30 IST

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్ మొత్తం 10 జట్లతో మంచి జోరుగా కొనసాగుతోంది. పలువురు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతుండగా.. మరికొందరు ఆటగాళ్లు అంచనాలు అందుకోలేకపోతున్నారు.

ఐపీఎల్‌ 2022లో ఇండియన్ సూపర్‌స్టార్లు డీలా

ముంబై : ఐపీఎల్ 2022 సీజన్ మొత్తం 10 జట్లతో మంచి జోరుగా కొనసాగుతోంది. పలువురు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతుండగా.. మరికొందరు ఆటగాళ్లు అంచనాలు అందుకోలేకపోతున్నారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న పలువురు ఇండియన్ సూపర్‌స్టార్ క్రికెటర్లు కూడా ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన వారిలో ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. విరాట్ ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 107 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ సీజన్‌లో పేవల ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. జట్టు ఓటముల బాటలో కొనసాగుతున్నా ఆదుకోలేకపోతున్నాడు. రోహిత్ శర్మ ఈ సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేదు. మంచి ఆరంభమే ఇస్తున్నా పరుగులు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు.

 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వారి బాటలోనే కొనసాగుతున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్ ఆడగా కేవలం  110 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఫ్లాప్ షోని కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటుందంటే అందుకు జడేజా ఫామ్‌లేమి కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ర్పీత్ బూమ్రాదీ ఇదే పరిస్థితి. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో తీసిన 3 వికెట్లు మినహా ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు.

Updated Date - 2022-04-15T00:26:21+05:30 IST