దుబాయిలో భారతీయ విద్యార్థిపై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-07-25T21:11:24+05:30 IST

ఎడారి దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న భారత్‌కు చెందిన విద్యార్థి గొప్పగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఏకంగా ఓ యాప్‌నే రూపొందించి, ప్రస్తుతం అందరి ప్రశంసలూ అందుకొంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వె

దుబాయిలో భారతీయ విద్యార్థిపై ప్రశంసల వర్షం

దుబాయి: ఎడారి దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న భారత్‌కు చెందిన విద్యార్థి గొప్పగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఏకంగా ఓ యాప్‌నే రూపొందించి, ప్రస్తుతం అందరి ప్రశంసలూ అందుకొంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెట్లను నరికి వాటి నుంచి సేకరించిన కలప ద్వారానే పేపర్‌ను తయారు చేస్తారు. పేపర్లను పుస్తకాల తయారీలో, ఇతర కార్యకాలాపాలకు వినియోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇలా తయారైన కొన్ని కోట్ల పుస్తకాలు ఏటా వృథాగా పోతున్నాయి. ఓ సర్వే ప్రకారం సుమారు 320 మిలియన్ల పుస్తకాలు వృథాగా పోతున్నాయి. 



ఈ క్రమంలో దుబాయి ఇంటర్నేషనల్ అకాడమీలో 10వ తరగతి చదువుతున్న భారత సంతతికి చెందిన ఆరుష్ నాగ్పాల్ అనే విద్యార్థి.. గొప్పగా ఆలోచించాడు. విద్యాసంవత్సరం పూర్తైన తర్వాత.. విద్యార్థి తాను చదివిన పుస్తకాలు ఇతరులకు విరాళం ఇచ్చేందుకు వీలుగా ‘ReuseKitab’ అనే పేరుతో ఓ యాప్‌ను రూపొందించాడు. అంతేకాకుండా ఈ యాప్ గురించి వివరిస్తూ ఔత్సాహికులు అందులో రిజిస్టర్ అయ్యేవిధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఆరుష్ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. యూఏఈలోని దాదాపు 120 స్కూల్‌లు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పుస్తకాలు వృథా కాకుండా ఇతరులకు ఉపయోగపడాలనే సంకల్పంతో యాప్‌ను రూపొందించిన ఆరుష్‌పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


Updated Date - 2021-07-25T21:11:24+05:30 IST