ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌లో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-08-15T21:04:51+05:30 IST

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(Indian Space Research Organization) (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(Indian Institute of Remote Sensing)(ఐఐఆర్‌ఎస్)-స్పేస్‌ టెక్నాలజీ ఆధారిత అంశాలపై ఉచితంగా ఆన్‌లైన్‌ ప్రోగ్రాములు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌లో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లు

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(Indian Space Research Organization) (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(Indian Institute of Remote Sensing)(ఐఐఆర్‌ఎస్)-స్పేస్‌ టెక్నాలజీ ఆధారిత అంశాలపై ఉచితంగా ఆన్‌లైన్‌ ప్రోగ్రాములు నిర్వహిస్తోంది. రిమోట్‌ సెన్సింగ్‌, జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌లపై యువతలో అవగాహన కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించారు. అభ్యర్థులు గరిష్ఠంగా మూడు ప్రోగ్రాములకు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. కాంప్రహెన్సివ్‌ ప్రోగ్రామ్‌లో 10,000 సీట్లు, మాడ్యూల్‌ ప్రోగ్రామ్‌లలో 5,000 సీట్లు ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్‌లో 25 సీట్లను విద్యార్థులకు ప్రత్యేకించారు. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ విధానంలో సీట్లు రిజర్వ్‌ చేస్తారు. 


బేసిక్స్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌: ఇది కాంప్రహెన్సివ్‌ కోర్సు. ఇందులో అయిదు మాడ్యూల్‌ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌ను  ఆగస్టు 22 నుంచి నవంబరు 25 వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌, 5 గంటల నుంచి 5.30 నిమిషాల వరకు ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ ఉంటాయి.


మాడ్యూల్‌ ప్రోగ్రామ్‌లు

రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ డిజిటల్‌ ఇమేజ్‌ అనాలిసిస్‌: ఈ ప్రోగ్రామ్‌ను ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 16 వరకు నిర్వహిస్తారు. ఇందులో బేసిక్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌, ఎర్త్‌ అబ్జర్వేషన్‌ సెన్సార్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌, స్పెక్ట్రల్‌ సిగ్నిచర్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ ల్యాండ్‌ కవర్‌ ఫీచర్స్‌, ఇమేజ్‌ ఇంట్రప్రిటేషన్‌, థర్మల్‌ అండ్‌ మైక్రోవేవ్‌ రిమోట్‌ సెన్సింగ్‌, డిజిటల్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌: బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ రెక్టిఫికేషన్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఎన్‌హాన్స్‌మెంట్‌, క్లాసిఫికేషన్‌ అండ్‌ అక్యూరసీ అసె్‌సమెంట్‌ టెక్నిక్స్‌ తదితర అంశాలపై సెషన్స్‌ ఉంటాయి.

గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం: ఈ ప్రోగ్రామ్‌ను సెప్టెంబరు 19 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. ఇందులో జీపీఎస్‌, జీఎన్‌ఎస్ఎస్ ల పరిచయం; రిసీవర్స్‌, ప్రాసెసింగ్‌ మెథడ్స్‌, ఎర్రర్స్‌ అండ్‌ అక్యూరసీ అంశాలపై సెషన్స్‌ ఉంటాయి.

జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం: ఈ ప్రోగ్రామ్‌ను అక్టోబరు 3 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఇందులో జీఐఎస్‌, డేటాబేసెస్‌, టోపోలజీ, స్పేషియల్‌ అనాలిసిస్‌, ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ అంశాలపై సెషన్స్‌ ఉంటాయి.

బేసిక్స్‌ ఆఫ్‌ జియోకంప్యూటేషన్‌ అండ్‌ జియోవెబ్‌ సర్వీసెస్‌: ఈ ప్రోగ్రామ్‌ను అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకు నిర్వహిస్తారు. ఇందులో జియోకంప్యూటేషన్‌ అండ్‌ జియోవెబ్‌ సర్వీసెస్‌ అంశాలపై సెషన్స్‌ ఉంటాయి.

ఆర్‌ఎస్‌ అండ్‌ జీఐఎస్‌ అప్లికేషన్స్‌: ఈ ప్రోగ్రామ్‌ను నవంబరు 14 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. ఇందులో అగ్రికల్చర్‌ అండ్‌ సాయిల్‌, ఫారెస్ట్రీ అండ్‌ ఎకాలజీ, జియోసైన్స్‌ అండ్‌ జియో హజార్డ్స్‌, మెరైన్‌ అండ్‌ అట్మాస్పిరిక్‌ సైన్సెస్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ స్టడీస్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అంశాలపై సెషన్స్‌ ఉంటాయి.

అర్హత: డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, అధ్యాపకులు, పరిశోధన సిబ్బంది కూడా అర్హులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బంది కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ సెషన్స్‌లో ప్రోగ్రామ్‌ స్టడీ మెటీరియల్‌కు సంబంధించిన లెక్చర్‌ స్లయిడ్స్‌, వీడియో రికార్డెడ్‌ లెక్చర్స్‌, డెమాన్‌స్ట్రేషన్లు ఉంటాయి. వీటిని ఐఐఆర్‌ఎస్‌ లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈ-క్లాస్‌) వెబ్‌సైట్‌: https://eclass.iirs.gov.in/loginలో అప్‌లోడ్‌ చేస్తారు. 

అభ్యర్థులు తాము చదువుతున్న/ పనిచేస్తున్న సంస్థ ద్వారాగానీ, వ్యక్తిగతంగాగానీ రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

సంస్థ నిబంధనల ప్రకారం 70 శాతం అటెండెన్స్‌, 40 శాతం మార్కులతో ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ఈ-సర్టిఫికెట్‌ ఇస్తారు.

వెబ్‌సైట్‌: https://www.iirs.gov.in/ EDUSAT-News

Updated Date - 2022-08-15T21:04:51+05:30 IST