అబుధాబి: భారత్‌కు చెందిన వ్యక్తికి యూఏఈలో అరుదైన గౌరవం దక్కింది. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను యూఏఈ ప్రభుత్వం గుర్తించింది. దీంతో యూఏఈ గోల్డెన్ వీసాను మంజూరు చేసి ఆయనను గౌరవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌కు చెందిన జోగిందర్ సింగ్ సలారియా కేవలం రూ.1000 చేతిలో పట్టుకుని 1993లో ఎడారి దేశంలో అడుగుపెట్టారు. దుబాయిలో కొద్దికాలంపాటు పని చేసి, ఆ తర్వాత సొంతంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగారు. అనంతరం ఢిల్లీ కేంద్రంగా 2012లో పెహెల్ ఛారిటబుల్ ట్రస్టు (పీసీటీ)ని ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ తర్వాత దీన్ని క్రమంగా పంజాబ్‌కు విస్తరించారు. ఈ క్రమంలోనే 2018లో ఇంటర్నెషనల్ హ్యూమనిటేరియన్ సిటీ (ఐహెచ్సీ)ని 2018లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు యూఏఈలో నిర్వరామంగా కొనసాగుతూనే ఉన్నాయి.
కాగా.. జోగిందర్ సింగ్.. సేవా కార్యక్రమాలను తాజాగా యూఏఈ గుర్తించింది. దీంతో ఆయనకు గోల్డెన్ వీసాను మంజూరు చేసి, గౌరవించింది. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తన సేవా కార్యక్రమాలకు దుబాయిలోని పోలీసులు ఎంతో సహకించారని వెల్లడించారు. అంతేకాకుండా రంజాన్ మాసం సందర్భంగా అబుధాబిలో భారీ ఎత్తున ఫుడ్ ప్యాకేట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కిందని పేర్కొన్నారు.