Australia: ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయ సింగర్ దుర్మరణం!

ABN , First Publish Date - 2022-09-02T18:49:29+05:30 IST

ఆస్ట్రేలియా (Australia)లోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారత సంతతి వ్యక్తి, పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ (Nirvair Singh) దుర్మరణం చెందాడు.

Australia: ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయ సింగర్ దుర్మరణం!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా (Australia)లోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో భారత సంతతి వ్యక్తి, పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ (Nirvair Singh) దుర్మరణం చెందాడు. మెల్‌బోర్న్‌లోని (Melbourne) బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్వేయర్ సింగ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, ఈ ఘటనకు కారణమైన 23 ఏళ్ల యువకుడితో పాటు 26 ఏళ్ల మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడి ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్వేయర్‌ సింగ్‌ తాను పని చేస్తున్న కార్యాలయానికి కారులో బయలుదేరాడు. మెల్‌బోర్న్‌లోని బుల్లా డిగ్గర్స్‌ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో నిర్వేయర్ కారు పలు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో అతడి కారు పూర్తిగా ధ్వంసం కాగా నిర్వేయర్‌ సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన నిర్వేయర్‌ సింగ్‌ శిక్షణ తీసుకునేందుకు 9 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. పంజాబీ సింగర్‌గా, ర్యాపర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఆయన పాడిన పలు పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి కూడా. ఇక నిర్వేయర్‌ మృతిపట్ల అభిమానులు‌, ఫాలోవర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 


Updated Date - 2022-09-02T18:49:29+05:30 IST