Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైత్‌లో అనుమానాస్పద స్థితిలో భారతీయుడు మృతి

న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కువైత్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన జగదీశ్ (44) గత కొన్నేళ్లుగా కువైత్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వరిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం రోజు కూడా విధులకు హాజరైన ఆయన.. బాత్‌రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో ఎంబసీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తుపాకీ తూటా కారణంగా జగదీశ్ మరణించినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జగదీశ్ సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement