ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్త సేకరణ శిబిరం

ABN , First Publish Date - 2020-08-10T11:08:44+05:30 IST

కరోనా ఉధృతి కారణంగా జిల్లాలో రక్త దానం చేయడానికి ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో రక్తనిల్వలకు ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్త సేకరణ శిబిరం

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 9 : కరోనా ఉధృతి కారణంగా జిల్లాలో రక్త దానం చేయడానికి ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో రక్తనిల్వలకు ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ఇండి యన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం  రౌతుగూడెంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గ్రామ యువజన సంఘానికి చెందిన 20 మంది 20  యూనిట్ల రక్తాన్ని దానం చేశారని జిల్లా రెడ్‌క్రాస్‌  చైర్మన్‌ మామిళ్ళపల్లి జయప్రకాశ్‌ తెలిపారు. సేకరించిన రక్తాన్ని తలసీమియా రోగులు, ఇతర రక్త సంబంధిత వ్యాధు లతో బాధపడుతున్న వారికి అందజేస్తామన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రెడ్‌క్రాస్‌ కార్యదర్శి తన్నీరు బుజ్జి, బ్లడ్‌ బ్యాంక్‌ కో ఆర్డినేటర్‌ చంద్ర మోహన్‌, రెడ్‌క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T11:08:44+05:30 IST