Indian Railways: దేశంలో 261 గణపతి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-09-08T15:30:59+05:30 IST

దేశంలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో దేశంలో 261 గణపతి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది....

Indian Railways: దేశంలో 261 గణపతి ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ : దేశంలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో దేశంలో 261 గణపతి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం గణపతి స్పెషల్ రైళ్లను ఈ నెల 7 నుంచి 20వతేదీ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి 201 ప్రత్యేక రైళ్లు, పశ్చిమ రైల్వే జోన్ లో 42 ప్రత్యేక రైళ్లు నడుపుతామని అధికారులు చెప్పారు.కొంకణ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 18 స్పెషల్ రైళ్లను పండుగ సందర్భంగా నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక గణపతి రైళ్లలో ప్రయాణించడానికి టికెట్లు రిజర్వేషన్ కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేశంలోని పలు రైల్వేస్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. 



Updated Date - 2021-09-08T15:30:59+05:30 IST