Abn logo
Aug 10 2020 @ 02:09AM

జెమ్‌ పోర్టల్‌తో భారత రైల్వేస్‌ అనుసంధానం

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ 


న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జెమ్‌)తో అనుసంధానం కావడానికి భారత రైల్వేస్‌ కట్టుబడి ఉందని, మొత్తం ప్రొక్యూర్‌మెంట్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌కు మార్చనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రైల్వేస్‌ తన కార్యకలాలు/తన పరిధిలోని పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్స్‌/ఉత్పత్తి యూనిట్ల కోసం నేరుగా వస్తుసేవలను సమీకరిస్తోందని, ఇందుకు రూ.70,000-75,000 కోట్లు వెచ్చిస్తోందని ఆయన చెప్పారు. జెమ్‌కు మారడం వల్ల 10-15 శాతం ఆదా అవుతుందని భావిస్తున్నామన్నారు. రైల్వేస్‌ 98 శాతానికి పైగా వస్తుసేవలను దేశీయంగానే కొనుగోలు చేస్తోందని, వచ్చే 8-12 నెలల కాలంలో ఈ కొనుగోళ్లను జెమ్‌ప్లాట్‌ఫామ్‌కు మార్చుతామన్నారు.  కాగా జెమ్‌ 4.0 అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను కొన్ని నెలల్లోనే విడుదల చేయనున్నట్టు జెమ్‌ సీఈఓ తలీన్‌ కుమార్‌ తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement