దేశంలో నేడు 273 రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2022-03-19T16:30:27+05:30 IST

దేశంలో శనివారం పలు కారణాల వల్ల 273 రైళ్లను రద్దు చేశారు....

దేశంలో నేడు 273 రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: దేశంలో శనివారం పలు కారణాల వల్ల 273 రైళ్లను రద్దు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే 273 రైళ్లను ఇండియన్ రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు. నిర్వహణ, ఆపరేషనల్ సమస్యలతో 253 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేశామని రైల్వే అధికారులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో ప్రకటించారు. మరో 20 రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని రైల్వే అధికారులు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, అసోం రాష్ట్రాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు వివరించారు. రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.


Updated Date - 2022-03-19T16:30:27+05:30 IST