లాక్‌డౌన్ ఎఫెక్ట్: మరో పది రైళ్లను రద్దు చేసిన రైల్వే

ABN , First Publish Date - 2021-05-18T00:34:11+05:30 IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో భారతీయ రైల్వేలోని నార్త్‌వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మరో పది రైళ్లను రద్దు చేసిన రైల్వే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో భారతీయ రైల్వేలోని నార్త్‌వెస్ట్రన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో మరో పది రైళ్లను రద్దు చేసింది. వీటిలో జోధ్‌పూర్-ఇండోర్, జోధ్‌పూర్-ఢిల్లీ సరై రోహిల్లా, జోధ్‌పూర్-బిలాడా, జోధ్‌పూర్-బార్మెర్, శ్రీగంగానగర్-అంబాలా తదితర స్పెషల్ రైళ్లు ఉన్నట్టు నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఈ నెల 19 నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉండవని, తిరిగి ఆదేశాలు వచ్చే వరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.


 ఇవి కాకుండా ఈ నెల 19 నుంచి నాలుగు రైళ్ల ట్రిప్పులను తగ్గించారు. ఇందులో అజ్మేర్-అమృత్‌సర్ మధ్య నడిచే రైలు ఇకపై బుదవారం మాత్రమే నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ రైలు ఇప్పటి వరకు వారానికి రెండు సార్లు నడిచేసింది. మరోవైపు, తౌక్తే తుపాను కారణంగా పలు రైలు సర్వీసులను వెస్ట్రన్ రైల్వే రద్దు చేసింది.  

Updated Date - 2021-05-18T00:34:11+05:30 IST