Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైల్లో మిడిల్ బెర్త్ దొరికిందా... అయితే ఈ నిబంధనలు మీకోసమే!

న్యూఢిల్లీ: సాధారణంగా రైలు ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు తమకు ఇష్టమైన సీటును ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొందరు అప్పర్ బెర్త్‌ను ఇష్టపడితే, మరికొందరు లోయర్ బెర్త్ కోరుకుంటారు. ఇవికాకుండా మిడిల్ బెర్త్ లభించినవారు కొన్ని నియమాలను తెలుసుకుని, పాటించాల్సిన అవసరముంది. లేదంటే చిక్కుల్లో పడతారు. 

ఒకవేళ మీకుగానీ మిడిల్ బెర్త్ లభ్యమయితే దానిని 24 గంటల పాటు వినినియోగించుకోకూడదు. పైబెర్త్ లభ్యమైనవారికి ఇటువంటి నిబంధన వర్తించదు. వారు తమ ప్రయాణంలో ఎప్పుడైనా సరే తమ బెర్త్‌ను ఒక్కరే వినియోగించుకోవచ్చు. మిడిల్ బెర్త్ వారికి ఇది సాధ్యంకాదు. రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే మిడిల్ బెర్త్‌ను వినియోగించుకోవాలి. అదికూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ మాత్రమే ఈ బెర్త్ వినియోగించుకోవాలి. అయితే రాత్రి 10 గంటలు కాకుండానే ఎవరైనా మిడిల్ బెర్త్ వినియోగించుకోవాలనుకుంటే వారిని రైల్వే అధికారులు అడ్డుకుంటారు. అలాగే ఉదయం 6 గంటలయితే మిడిల్ బెర్త్‌ను కిందకు దించాల్సివుంటుంది. అప్పుడే లోయర్ బెర్త్ సీటులోని వారు కూర్చోగలుగుతారు. మిడల్ బెర్త్ పొందినవారు ఈ నియమాలను పాటించకపోతే రైల్వే నిబంధనల ప్రకారం చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement