దేశంలోని ఈ 5 రైల్వే లైన్ల నిర్మాణాలను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే!

ABN , First Publish Date - 2022-03-06T14:23:25+05:30 IST

భారతదేశంలోని రైల్వే నెట్‌వర్క్..

దేశంలోని ఈ 5 రైల్వే లైన్ల నిర్మాణాలను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే!

భారతదేశంలోని రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని టాప్-5 నెట్‌వర్క్‌లలో ఒకటి. లక్షలాది ఉద్యోగులు పనిచేస్తున్న అతిపెద్ద విభాగం. మన దేశంలో మొట్టమొదటి రైలు 1853 సంవత్సరంలో బోరిబందర్ నుండి థానే వరకు నడిచింది. ఇప్పుడు భారతీయ రైల్వేలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరువయ్యాయి. కొన్ని రైలు మార్గాల్లో సంకేతిక ఇబ్బందులు ఉన్నా వాటిని రైల్వే విభాగం అధిగమించింది. ఈ కోవలోని 5 రైల్వే లైన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొంకణ్ రైల్వే లైన్

మొత్తం రైల్వే స్టేషన్లు – 59

మొత్తం దూరం – 760 కి.మీ.లు

ప్రధాన వంతెనలు – 179

చిన్న వంతెనలు – 1819

మొత్తం మలుపులు – 320

మొత్తం సొరంగాలు – 92

మహారాష్ట్రలోని రోహా నుండి కర్ణాటకలోని థోకూర్ వరకు గల కొంకణ్ రైల్వే భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయి. ఈ రైలు మార్గంలో ఒకవైపు పశ్చిమ కనుమలలోని అందమైన కొండలు, మరోవైపు అరేబియా సముద్రం కనిపిస్తుంది కొంకణ్ రైల్వే పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రానికి సమాంతరంగా ఉన్న రైలు మార్గం. ఈ రైల్వే లైను అనేక నదులు, పర్వతాల గుండా వెళుతుంది. అరేబియా సముద్రాన్ని దాటుతుంది. ఈ రైలు మార్గంలో దాదాపు 2 వేల వంతెనలు. 92 సొరంగాలు ఉన్నాయి. ఈ లైన్ నిర్మాణం 20వ శతాబ్దంలో పూర్తయ్యింది. దేశంలోని ఈ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఫలితంగా వర్షాకాలంలో ఈ రైలు మార్గాన్ని నిర్మించడం పెద్ద సవాలుగా మారింది. కేవలం వాతావరణానికి సంబంధించిన సమస్యే కాకుండా 42 వేల మంది భూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకోవాల్సివచ్చింది. 15 సెప్టెంబరు 1990న, కొంకణ్ రైల్వే నిర్మాణం ఆమోదం పొందింది. దీనికి రోహాలో పునాది రాయి పడింది. ఈ లైన్ నిర్మాణం కోసం 5 సంవత్సరాల కాలపరిమితితో 30 వేల మంది కార్మికులు పనిచేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సుమారు 8 సంవత్సరాలు పట్టింది. 26 జనవరి 1998న ఈ రైలు మార్గం ప్రారంభమయ్యింది. ఈ రైలు మార్గం కారణంగా ముంబై నుండి గోవా, కొచ్చికి ప్రయాణం 10 నుండి 12 గంటలకు తగ్గింది. ఈ రైలు మార్గంలోని ప్రత్యేకత ఏమిటంటే.. రైలు ఒక సొరంగంలోకి ప్రవేశిస్తుంది.. బయటకు వచ్చాక మరొక సొరంగంలోకి ప్రవేశిస్తుంది. పర్వతాలను తొలిచి కొంకణ్ రైల్వే మార్గం నిర్మితమయ్యింది.  ఒకవైపు ఎత్తైన పర్వతం, మరోవైపు లోతైన లోయలు కనిపిస్తాయి. కొంకణ్ రైలు గోవాలోని సుదీర్ఘ ప్రాంతాన్ని కవర్ చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ మార్గంలో గోవా సముద్రం చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఇది ప్రయాణాన్ని అద్భుతంగా మారుస్తుంది. కొంకణ్ రైలు దేశంలోని పశ్చిమ తీరంలో 760 కి.మీ మేరకు ఉంది. కొంకణ్ రైలు గోవాలో 105 కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తుంది, ఇందులో జువారీ నదిపై వంతెన అద్భుతంగా కనిపిస్తుంది.




2. జమ్మూ-కత్రా రైల్వే లైన్

కత్రా రైల్వే స్టేషన్ ఎత్తు - 813.707 మీ (2,670 అడుగులు)

లైన్లు - జమ్ము - బారాముల్లా లైన్

మాతా వైష్ణో దేవినిని దర్శించుకునే భక్తులు ఈ రైలు మార్గం ద్వారా కత్రా చేరుకోవచ్చు. కత్రాకు వెళ్లే ఈ రైలు నెట్‌వర్క్ ఆసియాలోనే మూడవ అతిపెద్ద సొరంగాల రైలు మార్గం. 80 కిలోమీటర్ల  మేర సొరంగాలు, పర్వతాలు ఈ రైలు ప్రయాణంలో కనిపిస్తాయి. దాదాపు యాభై వంతెనల గుండా వెళ్లే ఈ రైలుకు సంబంధించిన 10.9 కి.మీ. ప్రయాణం సొరంగాల గుండానే సాగుతుంది. ఈ మార్గంలో ఉధంపూర్-కత్రా విభాగంలో 85 మీటర్ల ఎత్తైన వంతెన ఝజ్జర్ నదిపై నిర్మితమయ్యింది. ఇది కుతుబ్ మినార్ కంటే ఎత్తయినది. 3.15 కిలోమీటర్ల పొడవైన సొరంగం కూడా ఇదే. ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక మలుపులు, పర్వతాలు ఉన్నందున ఉదంపూర్-కత్రా రైలు మార్గం ఇంజినీర్లకు అతిపెద్ద సవాలుగా మారింది. కొండలను తొలిచి ఇక్కడ రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఇంజినీర్లకు కష్టమైన పనిగా మారింది.అయితే ఇంజనీర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 

3. రామేశ్వరం రైలు మార్గం

పాంబన్ వంతెన మొత్తం పొడవు - 6,776 అడుగులు (2,065 మీ)

ట్రాక్ గేజ్ - బ్రాడ్ గేజ్

నిర్మాణం ప్రారంభమైంది.. 1911, నిర్మాణం పూర్తయింది..1914

ఈ వంతెన సముద్రం మీద 2,065 మీటర్ల పొడవున నిర్మించారు. ఇది చెన్నైని రామేశ్వరంతో కలుపుతుంది. దీనిని పాంబన్ వంతెన లేదా రామేశ్వరం వంతెన అని కూడా అంటారు. దీనిని 1914లో నిర్మించారు. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 1885 లో బ్రిటిష్ రైల్వేస్ ద్వారా పాంబన్ వంతెన నిర్మాణం ప్రారంభమయ్యింది. దీని నిర్మాణం 1914 లో పూర్తయింది. ఈ వంతెన నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ వంతెన ప్రత్యేకత ఏంటంటే.. ఇది మధ్య నుంచి తెరుచుకుంటుంది. ఈ వంతెన కాంక్రీటుతో నిర్మితమయ్యింది. దాదాపు 145 స్తంభాలపై నిర్మితమయ్యింది. దీని పొడవు 2.3 కిలోమీటర్లు.

4. మణిపూర్ రైల్వే లైన్

ప్రాజెక్ట్ - ఈశాన్య ప్రాంతంలోని 7రాష్ట్రాలను కలుపుతుంది.

వంతెనల ఎత్తు - 141 మీటర్ల

నిర్మాణ పనులు పూర్తి - 2020 నాటికి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను మణిపూర్‌లో నిర్మించారు. ఈ వంతెన 141 మీటర్ల ఎత్తులో ఉంటుంది, ఇది ఐరోపాలోని మోంటెనెగ్రోలో నిర్మించిన 139 మీటర్ల ఎత్తైన మాలా-రిజెకా వయాడక్ట్ వంతెనను అధిగమిస్తుంది. ఈ వంతెనలో దాదాపు 45 సొరంగాలు ఉంటాయి. మణిపూర్‌లోని జిరిబామ్-తుపుల్-ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవున్న కొత్త బ్రాడ్ గేజ్ లైన్ కింద ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ 45 సొరంగాలలో, 12వ సంఖ్య సొరంగం పొడవు 10.80 కి.మీ. ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యంత పొడవైన రైలు సొరంగం ఇదేనని చెబుతారు. ఈ పొడవైన స్తంభాల తయారీకి స్లిప్ ఫారమ్ టెక్నిక్‌ని అవలంబించారు. ఈ రైల్వే నెట్‌వర్క్ 7 ఈశాన్య రాష్ట్రాలను కలుపుతుంది. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ రైలు మార్గం ద్వారా చైనా సరిహద్దుతో సహా మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకోవడం సాధ్యమవుతుంది. ఈ రైలు మార్గంలో హిమాలయ శ్రేణుల మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన గీర్డర్ రైల్వే బ్రిడ్జిని నిర్మించగలగడం భారతీయ రైల్వేలు సాధించిన ఘనత. 


5. ఢిల్లీ-లడఖ్ రైల్వే లైన్

సొరంగాలు - 74

ప్రధాన వంతెనలు - 74

చిన్న వంతెనలు - 396

స్టేషన్లు - 36

రైల్వే లైన్ ఎత్తు - 5,360 మీటర్లు

భారతీయ రైల్వే.. న్యూఢిల్లీ- లడఖ్‌లను అత్యంత ఎత్తైన రైల్వే లైన్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ఇది భారత్‌-చైనా సరిహద్దు సమీపంగా ఉండనుంది. ఇది బిలాస్‌పూర్-మనాలి-లేహ్ లైన్. ఈ రైల్వే లైన్ ఎత్తు సముద్ర మట్టానికి 5,360 మీటర్ల వరకు ఉంటుంది. ఈ లైన్ దాదాపు 465 కి.మీ పొడవు ఉంటుంది. ఈ లైన్‌లో 74 సొరంగాలు, 124 పెద్ద వంతెనలు, 396 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. అలాగే ఇందులో 30 స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో 3,000 మీటర్ల ఎత్తులో సొరంగం లోపల రైల్వే స్టేషన్‌ను నిర్మించడం అత్యంత కీలకమైనది. ఈ రైలు మార్గం నిర్మాణంతో ఢిల్లీ నుంచి లేహ్‌కు 20 గంటల్లో చేరుకోవచ్చు. 

Updated Date - 2022-03-06T14:23:25+05:30 IST