భారత తపాలా శాఖలో ఏజెంట్ల నియామకం

ABN , First Publish Date - 2022-05-25T22:56:20+05:30 IST

భారతీయ తపాలా శాఖ(indian postal department) వారు కమీషన్ ఆధారంగా తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా పాలసీలు సేకరించడానికీ ఏజెంట్లను నియమిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

భారత తపాలా శాఖలో ఏజెంట్ల నియామకం

హైదరాబాద్: భారతీయ తపాలా శాఖ(indian postal department) వారు కమీషన్ ఆధారంగా తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా పాలసీలు సేకరించడానికీ ఏజెంట్లను నియమిస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. 


ఆసక్తి కలిగినవారు మీ దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ కు తపాలా కార్యాలయానికి జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపిక చేసిన అభ్యర్థులు తేదీ జూన్ 15వ తేదీన ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కె. సంతోష్ నేత(k.santosh kumar neta) తెలిపారు. ఏజెంటుగా నియమితులైనవారు, సెక్యురిటి డిపాజిట్ గా రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్నివివరాలకు మీ సమీపంలో ఉన్నా తపాలా కార్యాలయము లేదా సికింద్రాబాద్ డివిషనల్ ఆఫీస్, గాంధీనగర్ ను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2022-05-25T22:56:20+05:30 IST