చిత్తూరు డీఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ABN , First Publish Date - 2020-08-15T10:43:36+05:30 IST

చిత్తూరు నగర డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు స్వాతంత్ర

చిత్తూరు డీఎస్పీకి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

చిత్తూరు, ఆగస్టు 14: చిత్తూరు నగర డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. 1989లో ఉద్యోగంలో చేరిన ఆయన 2002లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, 2009లో ఉత్తమ సేవా పతకం, 2010లో ముఖ్యమంత్రి శౌర్యపతకం, 2011లో రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్‌ శౌర్యపతకాన్ని పొందారు.


గత ఏడాది జూలైలో చిత్తూరు డీఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. దోషులను చట్టపరంగా శిక్షించినపుడే ప్రజలకు పోలీసుశాఖపై నమ్మకం కలుగుతుందని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక మెడల్‌కి ఎంపికైన ఆయన్ను ఎస్పీ సెంథిల్‌కుమార్‌, ఏఎస్పీ మహేష్‌ తదితరులు అభినందించారు. 

Updated Date - 2020-08-15T10:43:36+05:30 IST