Abn logo
Mar 25 2020 @ 08:15AM

శానిటైజర్ తో లాఠీలను సిద్ధం చేస్తున్న పోలీసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటే, ప్రజలు బయటకు రాకుండా పోలీసులు చూస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను  ఎదుర్కోవటానికి సహకరిస్తున్నారు. అయితే కొందరు కుర్రాళ్ళు రోడ్లమీదకు వచ్చి విన్యాసాలు చేస్తున్నారు. మరికొందరు ఖాళీగా వున్నరోడ్లపై బైకుతో తిరుగుతున్నారు. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు పోలీస్ లు  తమ లాఠీలకు పని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ లాఠీలను శానిటైజర్ తో శుభ్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఐపీఎస్ పంకజ్ నైన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


Advertisement
Advertisement