Breast Cancer: ఎక్స్‌పర్మెంటల్ చికిత్సలో వండర్.. చావు అంచు నుంచి బయటపడ్డ ఎన్నారై మహిళ!

ABN , First Publish Date - 2022-07-06T01:17:39+05:30 IST

‘మీకు బ్రెస్ట్ క్యాన్సర్’ అని డాక్టర్లు చెప్పడంతో ఆమె భయాందోళనలకు గురైంది. కానీ ఆ తర్వాత చికిత్స తీసుకుని.. మహమ్మారిని జయించింది. ఇక తన జీవితానికి ఏడోకా లేదు అని భావిస్తుండగా.. పిడుగులాంటి వార్త ఆమె చెవిని చేరింది. మరోమారు కాన్స

Breast Cancer: ఎక్స్‌పర్మెంటల్ చికిత్సలో వండర్.. చావు అంచు నుంచి బయటపడ్డ ఎన్నారై మహిళ!

ఎన్నారై డెస్క్: ‘మీకు బ్రెస్ట్ క్యాన్సర్’ అని డాక్టర్లు చెప్పడంతో ఆమె భయాందోళనలకు గురైంది. కానీ ఆ తర్వాత చికిత్స తీసుకుని.. మహమ్మారిని జయించింది. ఇక తన జీవితానికి ఏడోకా లేదు అని భావిస్తుండగా.. పిడుగులాంటి వార్త ఆమె చెవిని చేరింది. మరోమారు కాన్సర్ అటాక్ అయిందని తెలిసి.. నిర్ఘాంత పోయింది. వైద్యులు కూడా చేతులెత్తేయడంతో జీవితంపై ఆశలు వదులుకుంది. అనూహ్యంగా జరిగిన ఓ ఘటన ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. దీంతో ఆమె క్యాన్సర్‌ను జయించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో స్థిరపడ్డ భారత‌కు చెందిన మహిళ పేరు జాస్మిన్ డేవిడ్. ప్రస్తుతం ఆమె వయసు 51ఏళ్లు. 2016 నవంబర్‌లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డారు. దీంతో డాక్టర్లను సంప్రదించి.. చికిత్స తీసుకున్నారు. 15 సైకిల్స్ రేడియో థెరఫీ తర్వాత ఆమె క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డారు. అనంతరం.. 15 నెలలపాటు తనకు క్యాన్సర్ సోకిందనే విషయం కూడా మర్చిపోయి గడిపారు. అయితే.. 2019 అక్టోబర్‌లో ఆమెను క్యాన్సర్ మరోసారి అటాక్ చేసింది. వైద్యులు సైతం ఈ సారి చేతులు ఎత్తేశారు. క్యాన్సర్ కణాలు.. ఊరితిత్తులు, ఛాతి ఎముకల్లోకి కూడా విస్తరించినట్టు పేర్కొన్నారు. కొద్ది నెలలు మాత్రమే బతుకుతావని వైద్యులు స్పష్టం చేశారు.  



ఈ క్రమంలోనే నేషనల్ హెల్త్ సర్విస్ వైద్య బృందం ఆమెను సంప్రదించింది. తనపై ప్రయోగాత్మక చికిత్స జరిపేందుకు అనుమతి కావాలని కోరింది. వైద్య బృందం అభ్యర్థనపట్ల జాస్మిన్ సానుకూలంగా స్పదించారు. దీంతో వైద్యులు ఇమ్మూనోథెరపీ డ్రగ్‌తోపాటు.. ఎక్స్‌పర్మెంటల్ డ్రగ్‌ను ప్రతి మూడు వారాలకు ఒకసారి ఆమెకు అందించారు. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె శరీరంలో క్యాన్సర్ కణాల జాడ లేకుండాపోయింది. విషయం తెలిసి.. ఆనందంతో ఎగిరి గంతేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్స్‌పర్మెంట్ ట్రీట్మెంట్‌కు ఒప్పుకున్నట్టు చెప్పారు. అయితే ఆ చికిత్స తనకు జీవితాన్ని ప్రసాదించినట్టు వివరించారు. ఇదిలా ఉంటే.. ఈ ఎక్స్‌పర్మెంట్ ట్రీట్మెంట్‌ను ఆమె 2023 డిసెంబర్ వరకూ తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


Updated Date - 2022-07-06T01:17:39+05:30 IST