Bank of England: భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2022-05-18T16:13:32+05:30 IST

బ్రిటన్‌లో భారత సంతతి మహిళ డా. స్వాతి ధింగ్రాకు కీలక బాధ్యతలు దక్కాయి.

Bank of England: భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

లండన్‌: బ్రిటన్‌లో భారత సంతతి మహిళ డా. స్వాతి ధింగ్రాకు కీలక బాధ్యతలు దక్కాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో స్వాతికి ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి రిషి సునక్ కీలక బాధ్యతలు అప్పగించారు. Bank of England వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (MPC) ఎక్స్‌టర్నర్‌ సభ్యురాలిగా నియమించారు. దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించనున్న తొలి భారత సంతతి మహిళగా స్వాతి రికార్డుకెక్కారు. 2016 ఆగస్టు నుంచి ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్‌ సాండ్రూస్‌ స్థానంలో స్వాతి ఎంపికయ్యారు. 


2022 ఆగస్టు 9న ఆమె బాధ్యతలు చేపట్టి, మూడేళ్లపాటు ఈ పదవీలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (LSE)లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వాతి ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌ అప్లైడ్‌ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్‌ కలిగి ఉన్నారు. ఇక ఢిల్లీ యూనివర్శిటీలో స్వాతి విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌ నుండి ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు.  

Updated Date - 2022-05-18T16:13:32+05:30 IST