Abn logo
Oct 27 2021 @ 21:21PM

కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ

టొరంటో : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. భారత సంతతి మహిళ అనిత ఆనంద్‌కు రక్షణ మంత్రి పదవి ఇచ్చారు. భారత సంతతి నేత హర్జిత్ సజ్జన్ తర్వాత రక్షణ మంత్రిగా అనిత నియమితులయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ట్రుడు నేతృత్వంలోని లిబరల్ పార్టీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


హర్జిత్ సజ్జన్ సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా పని చేశారు. మిలిటరీ సెక్సువల్ మిస్‌కండక్ట్‌పై ఆయన వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా ఆయనకు ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మంత్రి పదవి లభించింది. 


అనితను రక్షణ మంత్రిగా నియమించడం వల్ల మిలిటరీ సెక్సువల్ మిస్‌కండక్ట్‌ బాధితులకు భరోసా లభించే అవకాశం ఉందని కెనడా మీడియా తెలిపింది. ఆమెను ఈ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని కొద్ది వారాలుగా డిఫెన్స్ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption