51ఏళ్ల వయసులో NRI మహిళ పాడు ఆలోచన.. తనకు 25ఏళ్ల వయసనీ.. ఆర్మీబేస్‌లో పని చేస్తున్నట్లు నమ్మించి..

ABN , First Publish Date - 2022-06-15T17:20:14+05:30 IST

ఆమెకు ప్రస్తుతం 51ఏళ్లు. వయసు పెరిగినా కానీ ఆమెకు బుద్ధి మారలేదు. తనకు 25ఏళ్ల వయసనీ.. ఆర్మీ బేస్‌లో పని చేస్తున్నట్లు నమ్మించి మరీ సింగపూర్‌లోని తండ్రీ, కొడుకులను బోల్తా కొట్టించింది. భారీ మొత్తంలో డబ్బులు దండుకుంది. ఆమె

51ఏళ్ల వయసులో NRI మహిళ పాడు ఆలోచన.. తనకు 25ఏళ్ల వయసనీ.. ఆర్మీబేస్‌లో పని చేస్తున్నట్లు నమ్మించి..

ఎన్నారై డెస్క్: ఆమెకు ప్రస్తుతం 51ఏళ్లు. వయసు పెరిగినా కానీ ఆమెకు బుద్ధి మారలేదు. తనకు 25ఏళ్ల వయసనీ.. ఆర్మీ బేస్‌లో పని చేస్తున్నట్లు నమ్మించి మరీ సింగపూర్‌లోని తండ్రీ, కొడుకులను బోల్తా కొట్టించింది. భారీ మొత్తంలో డబ్బులు దండుకుంది. ఆమె చేసిన తప్పులు తాజాగా కోర్టులో రుజువయ్యాయి. దీంతో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సింగపూర్‌లో నివాసం ఉంటున్న మలిహా రామ్ అనే మహిళకు ప్రస్తుతం 51 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితమే భర్తను పోగొట్టుకున్న ఈమె.. మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌‌ను వేదికగా మార్చుకుని.. అమాయకులతో ఆటలాడుకుంది. అందినంతా వారి నుంచి నొక్కేసింది. కీర్తన అనే పేరుతో తమిళ మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన ఆమె.. పెళ్లి కోసం సంప్రదించిన వారిని బురిడీ కొట్టిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 2018లో భారత్‌కు చెందిన గోవిందధనశేఖర్ అనే వ్యక్తి.. మ్యాట్రీమోని వెబ్‌సైట్ ద్వారా ఆమెను సంప్రదించగా అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేసింది. ఆస్ట్రేలియాలోని ఆర్మీ బేస్‌లో పని చేస్తున్నాని చెబుతూ.. అక్కడ కాంట్రాక్ట్ ముగియగానే పెళ్లి చేసుకుందాం అని నమ్మబలికింది. 



అనుమానం రాకుండా  కేవలం ఫోన్, చాట్ ద్వారానే సంభాషణలు జరిపి.. సోషల్ వర్క్ కోసమని నాటకాలాడి డిసెంబర్ 2018-అక్టోబర్ 2019 మధ్య సుమారు 4,750 సింగపూర్ డాలర్లను గోవిందధనశేఖర్ నుంచి తీసుకుంది. అంతేకాకుండా అతడి తండ్రి నుంచి కూడా సుమారు 1000 డాలర్లు నొక్కేసింది. అనంతరం పెళ్లి విషయాన్ని దాటవేస్తూ ఉండటంతో అనుమానం వ్యక్తం చేసిన గోవిందధనశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె బండారం బయటపడింది. ఈ కేసుపై విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం.. ఆమెకు ఏడు నెలల జైలు శిక్ష విధించింది. కాగా.. మలిహా రామ్.. ఇలా మోసాలకు పాల్పడటం ఇది తొలిసారేం కాదు. 2006-2007 మధ్య మోసాలకు పాల్పడి జైలు శిక్షను కూడా అనుభవించింది. 


Updated Date - 2022-06-15T17:20:14+05:30 IST