Advertisement
Advertisement
Abn logo
Advertisement

యూరప్ గణిత ఒలింపియాడ్‌కు 13 ఏళ్ల భారత సంతతి బాలిక !

లండన్: యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్‌(ఈజీఎంఓ)లో పోటీపడే బ్రిటన్ జట్టులో 13 ఏళ్ల భారత సంతతి బాలిక అనన్య గోయల్ చోటు దక్కించుకుంది. దీంతో యూరప్ గణిత ఒలింపియాడ్‌లో పాల్గొనబోతున్న అతి పిన్న వయస్కురాలిగా అనన్య రికార్డుకెక్కింది. వచ్చే నెల జార్జీయాలో ఈ పోటీలు జరగనున్నాయి. దక్షిణ లండన్‌లోని డల్‌విచ్‌లో ఉన్న అల్లీన్స్ స్కూల్‌ విద్యార్థిని అయిన అనన్య... కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటి దగ్గరే ఉండడంతో తన తండ్రి, మాజీ మ్యాథ్స్ ఒలింపియన్ అమిత్ గోయల్ ఆధ్వర్యంలో గణితంపై పట్టుసాధించింది. అనంతరం యూకే మ్యాథమ్యాటిక్స్ ట్రస్ట్(యూకేఎంటీ) నిర్వహించిన గణిత పరీక్షలు రాయడం, వాటిలో మంచి ఫలితాలు రావడంతో ఈజీఎంఓలో పోటీపడే బ్రిటన్ జట్టులో చోటు దక్కించుకుంది. 


ఇక బ్రిటన్ వ్యాప్తంగా ప్రతియేటా యూకేఎంటీకి ఆరు లక్షల మంది సెకండరీ స్కూల్ విద్యార్థులు హాజరవుతారు. వీరిలో టాప్ 1000 మందిని యేటా నవంబర్ నెలలో జరిగే బ్రిటిష్ మ్యాథమ్యాటికల్ ఒలింపియాడ్‌కు ఎంపిక చేస్తారు. మళ్లీ వీరిలోంచి టాప్ వంద మంది  రెండోసారి జనవరిలో జరిగే బ్రిటిష్ మ్యాథమ్యాటికల్ ఒలింపియాడ్‌లో పోటీపడాల్సి ఉంటుంది. ఇలా మూడుసార్ల వడబోత అనంతరం 50 మందిని ఈజీఎంఓకు సెలెక్ట్ చేస్తారు. ఇలా ఈ ఏడాది యూకే తుది జట్టులో అనన్యకు కూడా చోటు దక్కింది. ఈ జట్టులో అందరూ 15 ఏళ్లకు పైబడిన వారే ఉండగా.. అనన్య(13 ఏళ్లు) మాత్రమే అతి పిన్న వయస్కురాలు. కాగా, వచ్చే నెల జరిగే ఈజీఎంఓలో రాణిస్తానని అనన్య నమ్మకంగా చెబుతోంది.         

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement