బ్రిటన్‌లో భారతీయుడి బ్లాక్ మార్కెట్ దందా.. చివరకు

ABN , First Publish Date - 2021-03-03T22:56:47+05:30 IST

బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్లాక్ మార్కెట్‌లో మెడిసిన్స్ విక్రయిస్తూ పట్టుబడ్డాడు.

బ్రిటన్‌లో భారతీయుడి బ్లాక్ మార్కెట్ దందా.. చివరకు

లండన్: బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్లాక్ మార్కెట్‌లో మెడిసిన్స్  విక్రయిస్తూ పట్టుబడ్డాడు. తాజాగా ఈ కేసు బర్మింగ్‌హాం క్రౌన్ కోర్టులో విచారణకు రాగా.. దోషిగా తేలిన భారతీయుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బల్కీత్ సింగ్ ఖైరా(36) అనే భారతీయ వ్యక్తి  వెస్ట్ బ్రోమ్‌విచ్‌లో తన తల్లి నిర్వహించే మెడికల్ షాపులో పనిచేసే వాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రిస్క్రిప్షన్ లేని నిషేధిత మందులను బ్లాక్‌లో అమ్మడం మొదలెట్టాడు. ఇలా అతను ఇప్పటి వరకు సుమారు ఒక మిలియన్ పౌండ్స్(రూ. 10.18కోట్లు) విలువ చేసే మందులను విక్రయించినట్లు అధికారుల విచారణలో తేలింది. బ్రిటన్‌లో ఇలా నిషేధిత, లైసెన్స్ లేని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం అనేది తీవ్ర నేరమని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ గ్రాంట్ పావెల్ తెలిపారు.


యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్ఏ) తరఫున ప్రస్తుతం బల్కీత్ సింగ్ కేసును గ్రాంటే దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఈ కేసు బర్మింగ్‌హాం క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో 2008 నుంచి అతడు ఈ దందా చేస్తున్నట్లు తేలింది. దీంతో న్యాయస్థానం బల్కీత్ సింగ్‌ను దోషిగా తేల్చింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే జనరల్ ఫార్మాస్యూటికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుంచి ఖైరాను తొలగించింది. 


Updated Date - 2021-03-03T22:56:47+05:30 IST