న్యూజిలాండ్‌లో భార‌తీయుడికి.. సొంతింటి క‌ల కాస్తా పీడ‌క‌ల‌ను మిగిల్చింది!

ABN , First Publish Date - 2021-05-25T17:32:58+05:30 IST

సొంత ఊరిలో ఉన్నా లేక‌ వేరే చోట ఉన్నా.. ఎక్క‌డున్నా స‌రే సొంత ఇళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. అందుకే చాలా మంది సొంత ఇంటి కోసం క‌ల‌లు కంటుంటారు. ఈ సొంతింటి క‌లే ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఓ భార‌త సంత‌తి వ్య‌క్తికి పీడ‌క‌ల‌గా మారింది.

న్యూజిలాండ్‌లో భార‌తీయుడికి.. సొంతింటి క‌ల కాస్తా పీడ‌క‌ల‌ను మిగిల్చింది!
ప్ర‌తీకాత్మ‌క చిత్రం..

అక్లాండ్‌: సొంత ఊరిలో ఉన్నా లేక‌ వేరే చోట ఉన్నా.. ఎక్క‌డున్నా స‌రే సొంత ఇళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. అందుకే చాలా మంది సొంత ఇంటి కోసం క‌ల‌లు కంటుంటారు. ఈ సొంతింటి క‌లే ఇప్పుడు న్యూజిలాండ్‌లో ఓ భార‌త సంత‌తి వ్య‌క్తికి పీడ‌క‌ల‌గా మారింది. ఇంటి డిజైన్ స‌మ‌యంలో జ‌రిగిన చిన్న పొర‌పాటు ప్ర‌స్తుతం భార‌త వ్య‌క్తిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తి కావ‌స్తున్న స‌మ‌యంలో అత‌డికి వింత స‌మ‌స్య ఎదురైంది. ప‌క్క‌న ఉండే వేరే వ్య‌క్తి ఇంటి స్థ‌లంలో భార‌తీయుడి కొత్త ఇంటి నిర్మాణం జ‌ర‌గ‌డ‌మే ఈ స‌మ‌స్య‌కు కార‌ణం. దాంతో వెంట‌నే ఇల్లును ఒక మీట‌ర్ మేర ప‌క్క‌కు జ‌ర‌ప‌డ‌మో లేదంటే రూ. 1కోటి 60 ల‌క్ష‌లు చెల్లించ‌డ‌మో చేయాల్సిన ప‌రిస్థితి దాపురించింది. 


వివ‌రాల్లోకి వెళ్తే.. అక్లాండ్‌లోని ప‌పాకూర ప్రాంతంలో త‌న సొంత స్థ‌లంలో దీప‌క్ లాల్ అనే భార‌త వ్య‌క్తి 2020 ప్రారంభంలో ఓ ఇంటి నిర్మాణాన్ని మొద‌లెట్టాడు. 'పినాక‌ల్ హోమ్స్' అనే నిర్మాణ సంస్థ‌ ఈ ఇంటికి డిజైన్ చేసింది. 2020 ఆగ‌స్టు నెల వ‌చ్చేస‌రికి దాదాపు ఇంటి నిర్మాణం పూర్తి కావొచ్చింది. స‌రిగ్గా అప్పుడే దీప‌క్‌కు ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. పొరుగింటి వ్య‌క్తి దీప‌క్ ఇంటి నిర్మాణం కొంత‌మేర‌ త‌న స్థ‌లాన్ని ఆక్ర‌మించింద‌ని సంబంధిత అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు దీపక్ కొత్త ఇల్లు ఒక మీట‌ర్ మేర పొరిగింటి వ్య‌క్తి స్థలంలో ఉన్నట్లు తేల్చారు. అంతే.. వెంట‌నే ఇంటిని ఒక మీట‌ర్ ప‌క్క‌కు జ‌ర‌ప‌డం లేదా ప‌క్కింటి వ్య‌క్తికి ఆ స్థ‌లం బ‌దులు రూ. 1కోటి 60 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని అధికారులు ఆదేశించారు. కాగా, ఇంటి డిజైన్ స‌మ‌యంలో పినాక‌ల్ హోమ్స్ చేసిన చిన్న పొర‌పాటు ఇప్పుడు దీప‌క్‌కు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేసింది. దీంతో దీప‌క్‌ సొంతింటి క‌ల కాస్తా పీడ‌క‌ల‌ను మిగిల్చిన‌ట్లైంది.      


Updated Date - 2021-05-25T17:32:58+05:30 IST