కటకటాలపాలైన భారత సంతతి యువకుడు.. చేసిన నేరం ఏంటంటే..!

ABN , First Publish Date - 2021-07-09T21:17:22+05:30 IST

భారత సంతతికి చెందిన 24 ఏళ్ల యువకుడు కటకటాలపాలైన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. భారత్ సంతతికి చెందిన ప్రదీప్ సింగ్ క్యూబెక్‌లో నివసిస్తున్నాడు. కాగా.. మాధక ద్రవ్యాలను అమెరికా నుం

కటకటాలపాలైన భారత సంతతి యువకుడు.. చేసిన నేరం ఏంటంటే..!

టొరెంటో: భారత సంతతికి చెందిన 24 ఏళ్ల యువకుడు కటకటాలపాలైన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. భారత్ సంతతికి చెందిన ప్రదీప్ సింగ్ క్యూబెక్‌లో నివసిస్తున్నాడు. కాగా.. మాధక ద్రవ్యాలను అమెరికా నుంచి కెనడాలోకి అక్రమంగా రవాణా చేస్తూ సరిహద్దుల్లో అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ప్రదీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, జైలు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో అమెరికా-కెనడా సరిహద్దుల వద్ద ప్రయాణ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. కేవలం అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఉన్నట్టు పేర్కొన్నారు. 



ఈ క్రమంలో కెనడా బార్డర్ ఏజెన్సీ అధికారులు సరిహద్దుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు  తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ సింగ్ నడిపిస్తున్న ట్రక్‌ను అధికారులు పరిశీలించినట్టు చెప్పారు. ప్రదీప్ సింగ్ మాధక ద్రవ్యాలను తరలిస్తున్నట్టు తనిఖీల్లో బయటపడిందని పేర్కొన్నారు. అతని వాహనంలోని ఐదు బ్యాగులలో 112.5కిలోల కొకైన్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దాని విలువ సుమారు 14 మిలియన్ల (సుమారు రూ.104కోట్ల) వరకు ఉంటుందని చెప్పారు. దీంతో ప్రదీప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని జైలు తరలించినట్టు తెలిపారు. అంతేకాకుండా ఆయనను శుక్రవారం కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు. 


Updated Date - 2021-07-09T21:17:22+05:30 IST