ట్రంప్‌ను దిమ్మదిరిగే ప్రశ్న అడిగిన భారత సంతతి జర్నలిస్ట్!

ABN , First Publish Date - 2020-08-15T05:50:28+05:30 IST

భారత సంతతికి చెందిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మొహం తెల్లబోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ట్రంప్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ వచ్చారు.

ట్రంప్‌ను దిమ్మదిరిగే ప్రశ్న అడిగిన భారత సంతతి జర్నలిస్ట్!

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మొహం తెల్లబోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ట్రంప్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ వచ్చారు. ఇదే సమయంలో భారత సంతతికి చెందిన శిరిష్ డేట్ అనే రిపోర్టర్ ట్రంప్‌ను ‘ఈ మూడున్నరేళ్లలో మీరు ఆడిన అబద్దాలకు ఎప్పుడైనా పశ్చాత్తాపం చెందారా?’ అని అడిగారు. దీంతో ట్రంప్‌కు ఏం చేయాలో తోచలేదు. ప్రశ్న అర్థం కానట్టు ఏంటంటూ మళ్లీ అడిగారు. శిరిష్ డేట్ మరోమారు ప్రశ్నను అడగడంతో.. ట్రంప్ సైలెంట్‌గా వేరే రిపోర్టర్‌ వైపు చూస్తూ వాళ్ల ప్రశ్నలు తీసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ట్రంప్ తప్పించుకున్నప్పటికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ట్రంప్‌ను ఈ ప్రశ్న అడగాలని గత ఐదేళ్ల నుంచి వేచిచూస్తున్నానంటూ ఈ సమావేశం అనంతరం శిరిష్ డేట్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా.. ఆయన పోస్ట్‌పై స్పందిస్తున్న అమెరికన్లు.. ఎంతో ధైర్యవంతుడివంటూ శిరిష్ డేట్‌ను కొనియాడుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఇటువంటి ప్రశ్నలు అడగడం తప్పంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. కాగా.. శిరిష్ డేట్ గత 33 సంవత్సరాల నుంచి జర్నలిజం వృత్తిలోనే కొనసాగుతున్నారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటి నుంచి ఆయన పొలిటికల్ సైన్స్‌లో బ్యాచులర్ డిగ్రీని పొందారు. ఫైనల్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. 

Video Credits: Guardian News

Updated Date - 2020-08-15T05:50:28+05:30 IST