అనుమానాస్పద స్థితిలో యూకేలో భారతీయ వైద్యుడి మృతి!

ABN , First Publish Date - 2020-05-29T23:07:50+05:30 IST

భారత్‌కు చెందిన వైద్యుడు యూకే‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు సమీపంలోని ఓ ఆసుప

అనుమానాస్పద స్థితిలో యూకేలో భారతీయ వైద్యుడి మృతి!

లండన్: భారత్‌కు చెందిన వైద్యుడు యూకే‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు సమీపంలోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వరిస్తున్న రాజేష్ గుప్తా.. గత సోమవారం  తాను ఉంటున్న హోటల్ గదిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కరోనా వైరస్ నేపథ్యంలో రాజేష్ గుప్తా గత కొంత కాలంగా తన కుటుంబానికి దూరంగా హోటల్‌లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. కాగా.. రాజేష్ గుప్తా మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన మరణం పట్ల.. బ్రిటన్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ నివాళులర్పించింది. 1997లో జమ్మూ యూనివర్సిటీ ద్వారా డాక్టర్ పట్టా పొందిన రాజేష్ గుప్తా.. 2006లో బ్రిటన్‌కు వెళ్లి, అక్కడ స్థిరపడ్డారు. ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి బ్రిటన్‌లో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 2.69లక్షల మంది కరోనా బారిన పడగా.. దాదాపు 37వేల మందికి పైగా కరోనా కాటుకు బలయ్యారు. అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా.. బ్రిటన్ రెండో స్థానంలో ఉంది. 


Updated Date - 2020-05-29T23:07:50+05:30 IST