Queen Elizabeth award: సుయేల్లా బ్రావెర్మన్‌‌కు 'క్వీన్ ఎలిజబెత్-2 అవార్డు'

ABN , First Publish Date - 2022-09-25T18:22:29+05:30 IST

భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయేల్లా బ్రావెర్మన్‌ (Suella Braverman)కు మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్-2 ఉమెన్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నారు.

Queen Elizabeth award: సుయేల్లా బ్రావెర్మన్‌‌కు 'క్వీన్ ఎలిజబెత్-2 అవార్డు'

లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయేల్లా బ్రావెర్మన్‌ (Suella Braverman)కు మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్-2 ఉమెన్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. యూకేలో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుంది. 


ఇక భారతీయ మూలాలు (Indian Origin) కలిగిన బ్రావెర్మన్ యూకేలోని వెంబ్లేలో పుట్టిపెరిగారు. ఆమె తల్లి హిందూ తమిళియన్ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్. అయితే, ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా రాజధాని నైరోబి నుంచి వలస వచ్చారు. ఈ దంపతులకు 1980లో బ్రావెర్మన్ జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన ఆమె.. బోరిస్ జాన్స్ హయాంలో అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అందరికి తెలిసిందంటారు బ్రావెర్మన్.  


Updated Date - 2022-09-25T18:22:29+05:30 IST