ఐఓఏ టోక్యో పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2020-03-16T10:20:58+05:30 IST

కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారుల టోక్యో పర్యటన వాయిదా పడింది. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రస్తుతానికి ...

ఐఓఏ టోక్యో పర్యటన వాయిదా

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారుల టోక్యో పర్యటన వాయిదా పడింది. కొవిడ్‌-19 ప్రభావంతో ప్రస్తుతానికి వెళ్లకపోవడమే మంచిదని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి తిరిగి ఎప్పుడు పర్యటించేది తర్వాత ప్రకటిస్తారు. రిజిజుతో పాటు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా, భారత బాక్సింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌, క్రీడా శాఖ కార్యదర్శి రాధే శ్యామ్‌, సాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ప్రధాన్‌లతో కూడిన అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 25 నుంచి 29 వరకు టోక్యోలో పర్యటించాల్సి ఉంది. 70 మందికి పైగా భారత అథ్లెట్లు ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. గేమ్స్‌కు ముందు కనీసం 125 మంది అయినా బెర్త్‌ దక్కించుకుంటారని ఐఓఏ ఆశిస్తోంది. మరోవైపు కొవిడ్‌-19 ఉధృతి జపాన్‌లో కూడా ఎక్కువగానే ఉండడంతో జూలైలో ఆరంభమయ్యే ఒలింపిక్స్‌ నిర్వహణపై కూడా సందేహాలు నెలకొంటున్నాయి. 


Updated Date - 2020-03-16T10:20:58+05:30 IST