Indian Oil వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు

ABN , First Publish Date - 2022-01-01T14:57:28+05:30 IST

సామాన్యులకు ఊరటనిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనవరి 1వ తేదీ శనివారం నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది....

Indian Oil వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు

రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరర్లకు ఊరట

న్యూఢిల్లీ: సామాన్యులకు ఊరటనిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనవరి 1వ తేదీ శనివారం నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరర్లకు ఊరట లభించనుంది.అయితే దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కంపెనీ మార్చలేదు. అంటే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు డిసెంబర్ 2021లో సిలిండరు గ్యాస్ కు చెల్లిస్తున్న ధరనే చెల్లించాల్సి ఉంటుంది.19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 తగ్గింది. తాజా సవరణతో ఢిల్లీలో నేటి నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,004కు తగ్గనుంది.


జనవరి 1 నుంచి కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.2,074.5 అవుతుంది. అదేవిధంగా ముంబైలో కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ తాజా ధర రూ.1,951గా ఉంది.చెన్నైలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ. 2,134.50 కు తగ్గించారు.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కస్టమర్‌లు తాజా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను తెలుసుకోవచ్చు.


Updated Date - 2022-01-01T14:57:28+05:30 IST